జూలై1న ఆర్బీఐ ఆఫీసులు తెరిచే ఉంటాయి

29 Jun, 2016 00:55 IST|Sakshi
జూలై1న ఆర్బీఐ ఆఫీసులు తెరిచే ఉంటాయి

ముంబై: ఆర్‌బీఐ కార్యాలయాలు వచ్చే నెల1న యధావిధిగానే పనిచేస్తాయి.  మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్ కోసం వచ్చే నెల 1(శుక్రవవారం) తమ కార్యాలయాలు పనిచేస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. సాధారణంగా  ఖాతాల వార్షిక ముగింపు సందర్భంగా ప్రతి ఏడాది జూలై1న ఆర్‌బీఐ  లావాదేవీలను అనుమతించదు. ఆర్‌బీఐ అకౌంటింగ్ ఇయర్ జూలై 1న ప్రారంభమై  జూన్ 30న ముగుస్తుంది.

ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్),  నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) సౌకర్యాలు 11 గంటల తర్వాత అందుబాటులో ఉంటాయని పేర్కొంది. లిక్విడిటీ అడ్జెస్ట్‌మెంట్ ఫెసిలిటి/మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కింద ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ కూడా ఉదయం 11 గంటల తర్వాతే అందుబాటులో ఉంటుందని వివరించింది. ఎల్‌ఏఎఫ్(లిక్విడిటీ అడ్జెస్ట్‌మెంట్ ఫెసిలిటీ) రెపో విండో ఉదయం 11.30-సాయంత్రం 3 గంటల మధ్య, 14 రోజుల టర్మ్ రెపో ఆక్షన్ విండో మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకూ పనిచేస్తాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

మరిన్ని వార్తలు