పరిశ్రమల నిరాశ...

4 Aug, 2015 23:45 IST|Sakshi

ఆర్‌బీఐ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరాశను వ్యక్తం చేశాయి. బలహీన డిమాండ్ మెరుగుదల, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా రుణ రేటు తగ్గిస్తే బాగుండేదని అన్నాయి. ఒక అవకాశాన్ని వదులుకున్నట్లయ్యిందని కూడా వ్యాఖ్యానించాయి.
 
రుణ డిమాండ్ బలహీనంగా ఉంది. కార్పొరేట్లు, బ్యాంకులు రుణ బకాయిల సమస్యలతో సతమతమవుతున్నాయి. మౌలిక రంగంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రుణ రేటు తగ్గించి ఉంటే... పెట్టుబడుల ప్రక్రియ ఊపందుకునేది. వర్షపాతం, ఫెడ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులన్నింటిపై ఒక సమగ్ర అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నందున, తదుపరి సమీక్షలో ఆర్‌బీఐ పాలసీ రేటు తగ్గిస్తుందని భావిస్తున్నా.
 -చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్
 
పరిశ్రమకు ఇది నిరాశకలిగించే అంశమే. పారిశ్రామిక వృద్ధి ఇంకా ఒడిదుడుకులుగానే ఉంది. డిమాండ్ పరిస్థితులు ప్రోత్సాహకరంగా లేవు. ఆయా పరిస్థితుల దృష్ట్యా పాలసీ ప్రోత్సాహకం ఉంటే మంచి ఫలితం ఉండేది.
 - జోత్స్నా సూరీ, ఫిక్కీ ప్రెసిడెంట్

>
మరిన్ని వార్తలు