అనిల్‌ అంబానీ రాజీనామా తిరస్కరణ

25 Nov, 2019 04:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా స్మృతి కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) డైరెక్టర్‌గా అనిల్‌ అంబానీ రాజీనామా చేయడాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాలను కూడా తోసిపుచ్చింది. నవంబర్‌ 20న జరిగిన సమావేశంలో సీవోసీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆర్‌కామ్‌ డైరెక్టర్లుగా కొనసాగాలని, దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి పరిష్కార నిపుణునికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సీవోసీ సూచించినట్లు వివరించింది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ పిటీషన్‌ మేరకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఆర్‌కామ్‌పై దివాలా ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. రుణాలిచి్చన బ్యాంకులు, ఆరి్థక సంస్థల క్లెయిమ్‌ ప్రకారం ఆర్‌కామ్‌ దాదాపు రూ. 49,000 కోట్లు బాకీ పడింది.

మరిన్ని వార్తలు