బిగ్‌ టీవీని విక్రయించిన ఆర్‌కామ్‌

6 Nov, 2017 19:21 IST|Sakshi

సాక్షి, ముంబై:   అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) సోమవారం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) సర్వీసుల రంగంలో ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమించిన సంస్థగా  పేరొందిన బిగ్‌ టీవీ విక్రయాన్ని కూడా ఆర్‌ కాం  పూర్తి చేసింది.    నష్టాలను తగ్గించుకునే పనిలో ఇప్పటికే 2,3జీ సేవలకు గుడ్‌  బై చెప్పిన ఆర్‌కాం బిగ్‌ టీవీని  అమ్మేసింది. తన ప్రత్యక్ష-హోం (డిటిహెచ్) అనుబంధ సంస్థ రిలయన్స్ బిగ్ టీవీని వీకాన్‌ మీడియాకు విక్రయించనున్నట్లు  తెలిపింది. ఈ మేరకు  వీకాన్ మీడియా అండ్ టెలివిజన్ లిమిటెడ్ (VMTL)తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. 

రిలయన్స్‌ బిగ్‌ టీవీలోని మొత్తం వాటా  వీకాన్‌  సొంతమవుతుందని వెల్లడించింది. అన్ని వర్తక బాధ్యతలతో పాటు కాంట్రాక్ట్ రుణాలు కూడా  కొనుగోలు సంస్థకే  చెందుతాయని  ఆర్‌కాం ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ బిగ్ టీవీ మొత్తం వాటాతో పాటు, దాదాపు 500 మంది ఉద్యోగులను కూడా వీకాన్‌ సొంతం చేసుకుటుందని  భరోసా ఇచ్చింది. ఈ ఒప్పందం​ మార్కెట్‌  రెగ్యులేటరీ సంస్థలు, ఆర్‌కామ్‌ లెండర్లు, ఇతర సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని చెప్పింది. అవసరమైన బ్యాంకు హామీలను సమర్పించిన తరువాత ప్రస్తుత డీటీహెచ్‌ లైసెన్స్ సమాచార  మరియు బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ  ద్వారా పునరుద్ధరించబడుతుందని ఓ ప్రకటనలో తెలిపింది.
 
1.2 మిలియన్ల కస్టమర్ల బిగ్‌ టీవీ సేవలను వినియోగదారులు నిరంతరాయంగా సేవలను పొందుతారనీమ వివరించింది. ఈ విక్రయం ద్వారా వచ్చే నిధుల ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోనున‍్నట్టు తెలిపింది.  అలాగే కంపెనీ రుణదాతలు, వాటాదారులతో సహా షేర్‌ హో‍ల్డర్స్‌ అందరికి  లబ్ది చేకూరుతుందని చెప్పింది. మరోవైపు ఈ వార్తలతో ఆర్‌కాం ఇవాల్టి మార్కెట్‌లో   6శాతానికిపైగా నష్టపోయింది. 


 

>
మరిన్ని వార్తలు