రియల్టీ బిజినెస్‌లో బ్లాక్‌మనీ అధికం

6 Dec, 2014 04:42 IST|Sakshi
రియల్టీ బిజినెస్‌లో బ్లాక్‌మనీ అధికం

ప్రభుత్వానికి ఐసీఏఐ నివేదిక
ముంబై: అత్యధిక శాతం నల్లధనం (బ్లాక్‌మనీ) రియల్టీ రంగంలోకి ప్రవహిస్తున్నదని దేశీ చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ(ఐసీఏఐ) ప్రభుత్వానికి నివేదించింది. ఇలాంటి చట్టవిరుద్ధ నిధుల్లో అధిక భాగం రియల్టీ బిజినెస్‌లోకి మళ్లుతున్నాయని అభిప్రాయపడింది. వెరసి వీటికి అడ్డుకట్ట వేసే బాటలో వెంటనే తగు చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఈ విషయాలను ఐసీఏఐ నివేదించింది. దేశీ రియల్టీ రంగ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు వీలుగా వెంటనే తగిన చర్యలను చేపట్టమంటూ సిఫారసు చేసింది. తద్వారా నల్లధన ప్రవాహానికి చెక్ పెట్టవచ్చునని పేర్కొంది. ఇప్పటికే రియల్టీ రంగంలో భారీ స్థాయిలో నల్లధనం పేరుకుపోయిందని ఐసీఏఐ కేంద్ర కమిటీ సభ్యులు తరుణ్ ఝియా వ్యాఖ్యానించారు. ఈ రంగాన్ని కేవలం నియమాలు, నిబంధనలతోనే నియంత్రించలేమని, డిమాండ్ సరఫరాల మధ్య అంతరాలపై సైతం దృష్టిపెట్టాల్సి ఉన్నదని సూచించారు.

మరిన్ని వార్తలు