లీకైన రెడ్‌మి 9 వివరాలు..

7 Jun, 2020 16:24 IST|Sakshi

ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి రెడ్‌మి 9‌ఫోన్‌కు‌ సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. జూన్‌ 25, 2020లో రెడ్‌మి 9ను లాంచ్‌ చేయనున్నారు. రెడ్‌మి 9 లాంచ్‌ చేసిన తర్వాత రెడ్‌మి 9A, 9Cలను కూడా విడుదల చేయనున్నారు. లీకయిన వివరాల ప్రకారం.. 3జీబీ ర్యామ్‌, 34 జీబీ స్టోరేజ్‌తో కూడిన రెడ్‌మీ 9 సిరీస్‌ ధర భారత్‌లో రూ. 10,500వరకు ఉండవచ్చు. మరోవైపు 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ ధర రూ.11,200 వరకు ఉండవచ్చు. 

ఓ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..  రెడ్‌మీ 9 ఫోన్‌ 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేతో ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ70 ను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సెటప్‌.. 13 మెగా పిక్సెల్ సెన్సార్‌, 8 మెగా పిక్సెల్‌ సెన్సార్‌, 5 మెగా పిక్సెల్‌ సెన్సార్, 2 మెగా పిక్సెల్‌ సెన్సార్‌లతో అలరించనుంది. ఇందులో  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్‌పోర్ట్‌, 3.5 ఎమ్‌ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు ఐఆర్‌ బ్లాస్టర్‌ లాంటి అత్యుధునికి సాంకేతికను అందించనున్నారు. చదవండి: అతిచవక ధరలో రెడ్‌మి టీవీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా