రెడ్‌మి నోట్‌ 8 కొత్త వేరియంట్‌ చూశారా?

27 Nov, 2019 14:45 IST|Sakshi

సాక్షి,ముంబై:  షావోమి రెడ్‌మి నోట్ 8లో కాస్మిక్‌  పర్పుల్‌ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్  లాంచింగ్‌ సందర్భంగా దీనిపై  అంచనాలను వెలువరించింది. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్ అమెజాన్‌, ఎంఐ.కాం ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు  కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ ఎంపికతో పాటు, ఇతర కలర్‌ ఆప్షన్లలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లభిస్తుంది. 

 
రెడ్‌మి నోట్ 8  ఫీచర్లు 
6.39 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డి  డిస్‌ప్లే
1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665  సాక్‌ 
ఆండ్రాయిడ్ 9 పై
48+8+2+2 ఎంపీ క్వాడ్‌ కెమెరా 
13 ఎంపీ సెల్పీ కెమెరా  
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు 
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ. 9,999  
6జీబీ  ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  రూ. 12,999

మరిన్ని వార్తలు