నిమిషాల్లోనే అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌

21 Oct, 2019 14:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: షావోమి తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసిన ‘రెడ్‌మి నోట్‌ 8, 8 ప్రో’ స్మార్ట్‌ఫోన్లు 15 నిమిషాల్లోపే అమ్ముడైపోయాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు  అమ్మకాలు ప్రారంభించిన వెంటనే హాట్‌కేకుల్లా సేల్‌ అయ్యాయి. ఎంఐ వెబ్‌సైట్‌లో నోస్టాక్‌ అని కనిపించగా, వెయిట్‌ లిస్ట్‌ ఫుల్‌ అని అమెజాన్‌ వెట్‌సైట్‌ చూపించింది. రేపు కూడా ఈ ఫోన్లు ఎంఐ, అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టనున్నట్టు షావోమి తెలిపింది. మంగళవారం (అక్టోబర్‌ 22) మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయి. 

ఇన్‌ బిల్ట్‌ అమెజాన్‌ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు.. గూగుల్‌ అసిస్టెన్స్, అలెక్సాతో పనిచేస్తాయని కంపెనీ వివరించింది. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్‌ ఇవే కావడంతో వీటిని కొనేందుకు వినియోగదారులు అమితాసక్తి చూపారు. ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్‌ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్‌సెట్‌తో విడుదలైన అధునాతన స్మార్ట్‌ఫోన్లు ఇవేనని సంస్థ ఇండియా హెడ్‌ మనుకుమార్‌ జైన్‌ అన్నారు. 

రెడ్‌మి నోట్‌ 8 ఫీచర్లు
 6.39 అంగుళాల డిస్‌ప్లే
 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 సాక్‌
 4 జీబీ ర్యామ్‌ , 64 జీబీ స్టోరేజ్‌
48+ 8 + 2 +2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ
4జీబీ/64జీబీ ధర రూ.9,999
6జీబీ/128జీబీ ధర రూ.12999

రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు
6.53 అంగుళాల డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
మీడియా టెక్‌ హీలియో ప్రాసెసర్‌ జీ90టీ
ఆండ్రాయిడ్‌ 9 పై
6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
4+8+2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500ఎంఏహెచ్‌ బ్యాటరీ
6జీబీ/64జీబీ ధర రూ.14999
6జీబీ/128జీబీ ధర రూ.15,999
8జీబీ/128జీబీ ధర రూ.17999

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా