అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌ ఫోన్లు

29 Aug, 2019 15:35 IST|Sakshi

బీజింగ్‌ :  ఇటీవల టీజర్‌తో సందడి చేసిన షావోమీ సబ్‌ బ్రాండ్‌ రెడ్‌మి నోట్‌ స్మార్ట్‌ఫోన్లు  బీజింగ్‌లో లాంచ్‌ అయ్యాయి.  రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌లో రెడ్‌మి నోట్‌ 8, రెడ్‌ మి నోట్‌ 8  ప్రొ పేరుతో, అద్భుత ఫీచర్లతో గురువారం వీటిని తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరల్లో వీటిని ఆవిష్కరించింది. వీటితోపాటు రెడ్‌మి టీవీని, నోట్‌బుక్‌ను కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. 

రెడ్‌మి నోట్‌లో  క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 సాక్‌, నోట్‌ 8 ప్రోలో  మీడియా టెక్‌  హీలియో  ప్రాసెసర్‌ను  అందించింది.  నోట్‌ 8 ప్రోలో మీడియా టెక్ గేమింగ్ ప్రత్యేకమైన చిప్ సెట్ ప్రాసెసర్,   64 ఎంపీ 25ఎక్స్‌ జూమ్‌, క్వాడ్‌కెమెరా ప్రధాన ఆకర్షణ.   అలాగే  20ఎక్స్‌  జూమ్,  క్వాడ్ కెమెరా సెటప్‌తో . రెడ్మి  నోట్ 8 ప్రో కెమెరా, ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వినియోగదారులకు ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది.  అంతేకాదు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వచ్చిన మొదటి ఫోన్‌  రెడ్‌మి నోట్‌ 8ప్రొ.

రెడ్‌మి నోట్‌ 8 ఫీచర్లు
6.39 అంగుళాల డిస్‌ప్లే
1080x2340  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 సాక్‌
4 జీబీ ర్యామ్‌ , 64 జీబీ స్టోరేజ్‌
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
48+ 8 + 2 +2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ
 


రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు
6.53  అంగుళాల డిస్‌ప్లే
1080x2340  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
మీడియా టెక్‌  హీలియో  ప్రాసెసర్‌ జీ90టీ
ఆండ్రాయిడ్‌ 9 పై

6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 
20 ఎంపీ సెల్ఫీ  కెమెరా
64+8+2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా​
4500ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు
మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన రెడ్‌మి నోట్‌ 8 ధరలు సుమారుగా
4జీబీ/64జీబీ  ధర రూ.10,000
6జీబీ/64జీబీ  ధర రూ.12,000
6జీబీ/128జీబీ  ధర రూ.14,000
ఫస్ట్‌ సేల్‌  సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం

మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన  రెడ్‌మినోట్‌ 8 ప్రొ ధరలు సుమారుగా
6జీబీ/64జీబీ  ధర రూ.14,000
6జీబీ/128జీబీ  ధర రూ.16,000
8జీబీ/128జీబీ  ధర రూ.18,000
ఫస్ట్‌ సేల్‌  సెప్టెంబరు 3  నుంచి ప్రారంభం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా