రెడ్‌మి ఫోన్‌ల సునామీ; 90సెకన్లలో నో స్టాక్‌

17 Mar, 2020 17:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: షియోమి తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసిన రెడ్‌మి నోట్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లు 90 సెకన్లలోనే అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. గత వారమే ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ రోజు అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఫస్ట్‌సేల్‌లో ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదనపు ఆకర్షణలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్‌తో పాటు ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం, ఎం స్టూడియో స్టోర్లలోనూ ఈ ఫోన్ కొనుగోళ్ల సునామీ సృష్టించింది. దీంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి‌.

మరోసేల్‌ను ఈ నెల 24న నిర్వహించనున్నట్టు షియోమీ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు. అమెజాన్‌లో ఈ ఫోన్లు విక్రయానికి పెట్టిన 90 సెకన్లలోనే అమ్ముడుపోయినట్టు మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ,128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.298, రూ.398  అన్‌లిమిటెడ్ ప్యాక్‌లపై డబుల్ డేటా వంటి ప్రయోజనాలను సైతం అందిస్తోంది. 

రెడ్‌మి నోట్ 9 ప్రొ ఫీచర్లు ఈ విధంగా.. 
- 6.67 అంగుళాల ఫుల్ హెడ్‌డీ ప్లస్ ఐపీఎస్‌ డిస్‌ప్లే
- 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనక నాలుగు కెమెరాలు
- ఫ్రంట్‌ 16 మెగాపిక్సెల్ కెమెరా
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
- 512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం
- 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు