24 గంటల్లో రిఫండ్!

1 Sep, 2015 02:12 IST|Sakshi
24 గంటల్లో రిఫండ్!

ఫ్లిప్‌కార్ట్ కొత్త పేమెంట్ విధానం
న్యూఢిల్లీ:
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ‘తక్షణ రిఫండ్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు ఒక ప్రాడక్ట్‌ను వెనక్కు తిరిగిచ్చేసిన తర్వాత, 24 గంటల్లో ఆ ప్రాడక్ట్ డబ్బుల్ని తిరిగి (రిఫండ్) పొందవచ్చు. గతంలో రిఫండ్ ప్రక్రియకు 3-5 పని దినాల సమయం పట్టేది. ఇమీడియట్ పేమెంట్స్ సిస్టమ్స్ ట్రాన్స్‌ఫర్స్ విధానం ద్వారా ఈ తక్షణ రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఐఎంపీఎస్ చెల్లింపు సౌకర్యం ఉన్న బ్యాంకులకు క్యాష్ ఆన్ డెలివరీ ఐఎంపీఎస్ రిటర్న్ ఫెసిలిటీ అందుబాటులో ఉందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు