రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం నాలుగింతలు

16 Aug, 2019 11:45 IST|Sakshi

క్యూ1లో రూ.1,218 కోట్లకు

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.295 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,218 కోట్లకు పెరిగిందని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.4,641 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.6,083 కోట్లకు ఎగసిందని వివరించింది. ఆస్తులు రూ.83,973 కోట్ల నుంచి రూ.79,207 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ప్రజల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఏమీ సమీకరించలేదని వివరించింది.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,454 కోట్ల నికర నష్టాలు వచ్చాయని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ కోసం రూ.2,104 కోట్లు కేటాయించడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది.

మరిన్ని వార్తలు