అన్న చేతికి తమ్ముడు : దూసుకెళ్తున్న రిలయన్స్‌

29 Dec, 2017 11:37 IST|Sakshi

ముంబై : రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ షేర్లు భారీగా దూసుకెళ్తున్నాయి. తమ్ముడు అనిల్‌ అంబానీ చెందిన ఆర్‌కామ్‌ వైర్‌లెస్‌ ఆస్తులను అన్న ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో దక్కించుకోబోతున్నట్టు ప్రకటించగానే, ఆర్‌కామ్‌ షేర్లు మరింత దూకుడుగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆర్‌కామ్‌ షేర్లు దాదాపు 35 శాతం పైకి  ఎగిశాయి. అంతేకాక గత మూడు వారాల్లో ఆర్‌కామ్‌ షేరు 280 శాతం లాభాలు పండించింది. ఇటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు కూడా స్వల్పంగా 0.6 శాతం లాభపడ్డాయి.  

ఇరు కంపెనీలు ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ డీల్‌ విలువ రూ.24,000 -25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు కొంత ఊరట లభించనుంది. ఈ డీల్‌ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగు కేటగిరీలు స్పెక్ట్రమ్, మొబైల్‌ టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్స్‌ నోడ్స్‌ను (ఎంసీఎన్‌) ఆర్‌కామ్‌ నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ దక్కించుకోబోతుంది.  ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్‌ జియో తెలిపింది. 
 

డీల్‌ ప్రకారం జియో దక్కించుకోబోతున్న ఆర్‌కామ్‌ ఆస్తులు
800/900/1800/2100 మెగాహెడ్జ్‌ బ్యాండ్స్‌లో 122.4 మెగాహెడ్జ్‌ 4జీ స్పెక్ట్రమ్‌
43వేలకు పైగా టవర్లు
సుమారు  1,78,000 ఆర్‌కేఎం ఫైబర్‌
248 మీడియా కన్వర్జన్స్‌ నోడ్స్‌

మరిన్ని వార్తలు