మెగా డీల్ : భారీ లాభాల్లోకి సూచీలు

22 Apr, 2020 14:18 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  లాభాల్లోకి మళ్లాయి.  ఫేస్‌బుక్‌ , రిలయన్స్ జియో మెగాడీల్ తో ఒక్కసారిగా ఇన్వెస్టర్లలో ఉత్సాహం పుంజుకుంది.  దీంతో ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ (ఆర్ ఐఎల్) సేరు 8 శాతానికి పైగా లాభపడింది. ఒంటిచేత్తో రిలయన్స్ మార్కెట్ ను లాభాల్లోకి  మళ్లించిందనే చెప్పాలి. రిలయన్స్ లాభాల మద్దతుతో సెన్సెక్స్ 680 పాయింట్లు  ఎగిసి 31318  వద్ద, నిఫ్టీ 175పాయింట్లు  లాభపడి 9157 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా  సెన్సెక్స్ 31 వేల,300 స్థాయిని, నిఫ్టీ9150 స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. మిడ్ స్మాలక క్యాప్ రంగాలు  నష్టాలనుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. (అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్)

అలాగే అంతర్జాతీయంగా  ముడి చమురు ధరలు (యుఎస్ ఆయిల్ ఫ్యూచర్స్) 20 శాతానికి పైగా పెరిగాయి. రెండు రోజుల ధరల పతనం తరువాత బ్రెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఆటో స్టాక్స్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో 3.7 శాతం ఎగిసాయి.  ఓఎన్ జీసీ , వేదాంతా, బీపీసీఎల్, ఐవోసీ, పవర్ గ్రిడ్,  లార్సెన్ ,  టాటా మోటార్స్, గ్రాసిం, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోతుండగా, జీ ఎంటర్టైన్మెంట్ అసియన్ పెయింట్స్, నెస్లే, భారతి ఇన్ ప్రాటెల్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, ఐటీసీ లాభపతున్నాయి.  నిఫ్టీ బ్యాంకు మాత్రం ఒడిదుడుకులమధ్య  ట్రేడ్ అవుతోంది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ)

మరోవైపు డాలరు బలంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరో రికార్డు కనిష్టానికి దిగజారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ట స్థాయి 76.88 పతనమైంది. చమురు ధరలు, త్రైమాసిక ఆదాయాలు,  దేశంలో కోవిడ్-19 సంక్రమణ వ్యాప్తిపై ఇన్వెస్టర్ల  దృష్టి వుంటుందని  విశ్లేషకులు తెలిపారు. (ఫేస్‌బుక్‌ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)

మరిన్ని వార్తలు