రిలయన్స్, ఫేస్‌బుక్: వన్ స్టాప్ సూపర్ యాప్

16 Apr, 2020 13:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ బహుళార్ధసాధకంగా వన్‌స్టాప్ సూపర్ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.  వీచాట్ మాదిరిగానే ఈ కొత్త యాప్‌ ద్వారా, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, గేమింగ్‌తో పాటు హోటల్ బుకింగ్‌, తదితర సేవలతో వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నాయి. ఇందుకు మోర్గాన్ స్టాన్లీని కూడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్‌గా నియమించుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న ఈ యాప్ తుది రూపు ఎలా వుంటుందనే దానిపై పూర్తి స్పష్టత రానప్పటికీ ప్రధానంగా వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా దీన్ని రూపొందించనుంది. ఈ యాప్ లో అన్ని అంశాలను మిళితం చేసేలా అమెరికాకు  చెందిన టాప్ కన్సల్టెంట్లను నియమించుకుందిట. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..)

కాగా  రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను కొనుగోలుకు ఫేస్‌బుక్ రంగం సిద్దం చేసుకున్న సంగతి విదితమే. ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన ప్రయాణ నిషేధంతో చర్చలు ఆగిపోయాయి. ఈ సవాళ్ల  నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రాజెక్టు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఫేస్‌బుక్ భారతదేశంలో తన డిజిటల్ పరిధిని విస్తరించుకోవాలని భావిస్తోంది.

చదవండి: (ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త)
76.80 స్థాయికి పడిపోయిన రూపాయి

>
మరిన్ని వార్తలు