దూసుకొచ్చిన ఆర్‌ఐఎల్‌

23 Aug, 2018 14:22 IST|Sakshi

సాక్షి, ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస రికార్డు గరిష్టాలతో దూసుకుపోతోంది. మరోవైపు కొర్పొరేట్‌ దిగ్గజం, ముకేశ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో ఘనతను సాధించింది. మార్కెట్‌క్యాప్‌లో 8లక్షలకోట్లనుదాటి ఆకర్షణీయంగా నిలిచింది. దేశంలో అతిపెద్ద  లిస్టెడ్‌ కంపెనీగా నిలిచింది.

ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆర్‌ఐఎల్‌  షేరు 1.28శాతం పుంజుకుని   52వారాల గరిష్టాన్ని టచ్‌ చేసింది. దీంతో సంస్థ మార్కెట్‌ క్యాపిటలేజేషన్‌ 8,00,128 కోట్ల  రూపాయలను అధిగమించింది.  ఈ క్రమంలో ఈ రేసులో ముందున్న  టెక్‌ దిగ్గజం  టీసీఎస్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. . టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ రూ. 7,77,870కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు