రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు భారీ ఆర్డర్‌

6 Dec, 2017 13:48 IST|Sakshi

సాక్షి, ముంబై:   రిలయన్స్‌  కమ్యూనికేషన్స్‌ నష్టాలతో సంక్షోభంలో పడ్డ  అనిల్‌ అంబానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది.   వేల కోట్ల  రూపాయల భారీ కంట్రాక్ట్‌ లభించిందన్న వార్తలతో  రిలయన్స్‌
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  ఇవాల్టి(బుదవారం) ప్రతికూల మార్కెట్లో లాభాలను ఆర్జిస్తోంది. రిలయన్స్‌ ఇన్ఫ్రా  బంగ్లాదేశ్‌ నుంచి రెండుప్రాజెక్టులను సాధించింది. 

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బంగ్లాదేశ్‌నుంచి రూ. 5 వేల కోట్ల  కాంట్రాక్టులను పొందింది. ఢాకాలో మేగానాఘాట్ వద్ద 750 మెగావాట్ల ఎల్ఎన్‌జీ ఆధారిత కంబైన్‌డ్‌
సైకిల్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు ఈపీసీ కాంట్రాక్ట్‌ లభించినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది.  అలాగే కుతుబ్దియా ఐలాండ్‌ వద్ద
ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధికి సైతం ఆర్డర్‌ దక్కినట్లు తెలియజేసింది. 2019 కల్లా వీటిని పూర్తిచేయాల్సి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఆర్డర్ల విలువ రూ. 5,000 కోట్లని ఒక ప్రకటనలో
తెలిపింది. 

250 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల రెండు లిగ్నైట్ ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 3,675 కోట్ల  ఇపిసి ఆర్డర్‌ తరువాత ఈ భారీ  
ఆర్డర్‌ సాధించామని రియలన్స్‌ ఇన్ఫ్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ గుప్తా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు