సన్నద్ధత లేకే కాల్ డ్రాప్స్

28 Sep, 2016 01:02 IST|Sakshi
సన్నద్ధత లేకే కాల్ డ్రాప్స్

న్యూఢిల్లీ: తమ నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు తగినన్ని ఇంటర్ కనెక్ట్ పాయింట్లు కల్పించడం లేదంటూ జియో చేస్తున్న ఆరోపణలకు ఎయిర్‌టెల్ మంగళవారం గట్టిగా సమాధానమిచ్చింది. తప్పంతా జియోవైపే ఉందని ఆరోపణలను తిప్పికొట్టింది. నెట్‌వర్క్ కనెక్టివిటీ, కాల్స్ డ్రాప్స్ అంశాలు జియో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడం, తగిన మేర పరీక్షలు నిర్వహించకపోవడం, కార్యకలాపాల ప్రారంభానికి ముందే భారీగా కస్టమర్లను చేర్చుకోవడం వల్ల ఏర్పడినవేనని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ మేరకు జియోకు ఓ లేఖ రాసింది.

మరిన్ని వార్తలు