జియో స్టార్టర్‌ కిట్‌ వచ్చేసింది

6 Jul, 2017 20:47 IST|Sakshi
జియో స్టార్టర్‌ కిట్‌ వచ్చేసింది

న్యూఢిల్లీ: ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన  రిలయన్స్  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్‌టీని  తన కనుగుణంగా మలుచుకుంటోంది.  ‘జియో వైఫై  జియో జీఎస్‌టీ’ స్టార్టర్‌ కిట్‌ పేరుతో మరో బంపర్‌ ఆఫర్‌ను  ప్రకటించింది. జియో గురువారం జ్యోతి జ్యోతిస్ట్ స్టార్టర్ కిట్‌ను గురువారం లాంచ్‌ చేసింది.  ఇందులో బిల్లింగ్‌ అప్లికేషన్‌, జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ ఉచితం. దీంతోపాటు జియో వైఫై డివైస్‌ లో ఏడాది పాటు అపరిమిత కాల్స్‌, 24 జీబీ డేటా అందించనుంది. ఈ కిట్‌తో పాటు వినియోగదారులకు 10,884 రూపాయల ఇతర  ఆఫర్లను  పొందవచ‍్చని కంపెనీ తెలిపింది.  
 
రిలయన్స్ జియో వెబ్‌ సైట్‌  ప్రకారం, రూ. 1,999 ఖర్చు చేసే ఒక పరికరాన్ని, వినియోగదారులు 10,884 రూపాయల వరకు ఆఫర్లను పొందగలుగుతారు.  అంతేకాదు  జియో జీఎస్టీ కిట్‌ను ఈఎంఐ ప‌ద్ధ‌తిలో కూడా కొనుక్కోవ‌చ్చట. జీఎస్‌టీ స్టార్టర్‌ కిట్‌లో పన్నుచెల్లింపుదారులను అనుమతించడానికి వీలుగా  'జీయో- జీఎస్‌టీ సొల్యూషన్' ను అం‍దిస్తోంది. జియో యాప్‌ బేస్డ్‌ జీఎస్‌టీ సొల్యూషన్‌ ప్లాట్‌ ఫాం ద్వారా   రిటైలర్లు తమ రికార్డులను నిర్వహించడానికి, జిఎస్టికి తిరిగి రాబట్టడానికి జీఎస్‌టీ  చట్టం నిబంధనలకు అనుగుణంగా సహాయపడుతుంది.  
ఇది ఏబిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌కైనా ఇది అనుగుణంగా ఉంటుంది. అంటే బిల్లింగ్‌సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్‌ తో  పనిలేకుండానే   జీఎస్‌టీ ఫైలింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.   ఈ సేవలను ఏడాదిపాటు పొందవచ్చు.  
రూ. 4999 విలువైన జియో బిల్లింగ్‌ అప్లికేషన్‌ ఉచితం.  దీని సహాయంతో  మొబైల్‌ లో  రిటర్న్‌ ఫైలింగ్‌,  ఇన్‌ వాయిస్‌లను తీసుకోవచ్చు. దీంతో  వివిధ ఉత్పత్తులు, సర్వీసుల పన్నురేటును తెలుసుకోవచ్చు. అలాగే జీఎస్‌టీ ఫైలింగ్‌ సందర‍్భంగా  టాక్స్‌ ఎక్స్‌పర్ట్‌లు సలహాలు కూడా ఉచితం.

జియో స్టార్టర్ కిట్ పొందడానికి  Jio.comలోకి వెళ్లి  స్టార్టర్ కిట్ ఆర్డర్ చేయాలి. డోర్‌ డెలివరీ ఆప్షన్‌ కూడా ఉంది.   దీంతో జియో సిమ్‌ లో జియోజీఎస్‌టీ.కామ్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఇక్కడ జీఎస్‌టీన్‌ ఎంచుకొన్న అనంతరం మొబైల్‌  ఎంఎస్‌ఐఎస్‌డీఎన్‌ను (మొబైల్ స్టేషన్ ఇంటర్నేషనల్ సబ్స్క్రయిబర్ డైరెక్టరీ నంబర్‌​)  జత చేయాలి. దీంతో  స్టార్టర్‌ కిట్‌ యాక్టివేట్‌ అవుతుంది.


 

మరిన్ని వార్తలు