జియో బాదుడు.. 39% పైనే

5 Dec, 2019 06:04 IST|Sakshi

ఐడియా, ఎయిర్‌టెల్‌ బాటలోనే...

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో... ఛార్జీలు పెంచుతూ కొత్త రేట్లను బుధవారం విడుదలచేసింది. డిసెంబర్‌ 6 నుంచి ధరలు పెరగనున్నట్లు కంపెనీ గతంలోనే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యారిఫ్‌లతో పోల్చితే 39%కి పైగా పెంపును ప్రకటించింది. రోజుకు 1.5 జీబీ డేటాతో 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాకేజీ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా.. దీని ధరను రూ. 555 చేసింది. రూ.153 ప్లాన్‌ ధర శుక్రవారం నుంచి రూ.199 కానుంది.  రూ.349 ప్లాన్‌ రూ. 399గా మారనుంది. రూ.448 ప్లాన్‌ రూ.599 కానుండగా.. ప్రస్తుతం ఏడాదికి రూ.1,699గా ఉన్న ప్లాన్‌ రూ.2199కి చేరనుంది. ట్యారిఫ్‌ పెరిగినప్పటికీ.. పోటీ సంస్థలు ఇస్తోన్న ప్లాన్‌లతో పోలిస్తే మాత్రం తమ నూతన ట్యారిఫ్‌ 25 శాతం తక్కువగా ఉన్నట్లు కంపెనీ వివరించింది. రూ.199 ప్లాన్‌ను ఇతర సంస్థలు రూ. 249కి అందిస్తున్నాయని లెక్కలు వేసి చూపిస్తోంది.

>
మరిన్ని వార్తలు