‘జియోఫోన్‌ 2’ తర్వాత సేల్‌ ఎప్పుడంటే..

16 Aug, 2018 13:04 IST|Sakshi
జియోఫోన్‌ 2

రిలయన్స్‌ జియో తన జియోఫోన్‌ హై-ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2 ఫ్లాష్‌ సేల్‌ను ప్రారంభించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్‌ జియో వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి తెచ్చింది. జియో.కామ్‌, రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌ను నిర్వహించింది. జియోఫోన్‌ 2 తొలి సేల్‌ను ముగించి, తర్వాతి ఫ్లాష్‌ సేల్‌ ఆగస్టు 30 మధ్యాహ్నం 12 గంటలకు అని కూడా పేర్కొంది. జియో ఫోన్ 2 ధర 2999 రూపాయలు. వినియోగదారులు తమ పాత ఫీచర్‌ ఫోన్‌ను ఇచ్చి రూ. 501కు కొత్త జియో ఫోన్‌‌ను పొందవచ్చు. జియో ఫోన్ 2 వినియోగదారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 కింద ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. బుధవారం నుంచి జియో గిగాఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది.

జియోఫోన్‌ 2 ఫీచర్లు
2.4 అంగుళాల హారిజంటల్ డిస్‌ప్లే‌తో పాటు క్వర్టీ కీప్యాడ్
జీపీఎస్‌, ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సప్
512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమరీ కార్డుతో 128 జీబీ వరకు)
2000ఎంఏహెచ్ బ్యాటరీ
వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా
ముందు భాగంలో వీజీఏ సెల్ఫీ కెమెరా
4జీ ఫీచర్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై

‘భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని పెంచేందుకు జియోఫోన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రతి ఒక్క భారతీయుడికి ఇంటర్నెట్‌ యాక్సెస్‌ను కల్పించి, డిజిటల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేసే అవకాశం కల్పించనున్నాం’ అని జియోఫోన్‌ 2ను అందుబాటులోకి తీసుకొస్తూ రిలయన్స్‌ జియో ఈ ప్రకటన చేసింది.

జియోఫోన్‌ లేటెస్ట్‌ ఫీచర్లు...

  • ఆగస్టు 15 నుంచి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌ను జియోఫోన్‌ కస్టమర్లు పొందుతున్నారు.
  • వాట్సాప్‌ కూడా బ్యాచ్‌ వారీగా అందుబాటులోకి వస్తుంది.
  • జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్‌, జియోఛాట్‌ అప్లికేషన్ల ప్రీమియం కంటెంట్‌ను పొందడంతో పాటు, ఉచిత వాయిస్‌ కాల్స్‌ కూడా పొందుతారు.
  • వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ ద్వారా కాల్స్‌ చేసుకోవడం, మెసేజ్‌లు పంపుకోవడం, ఇంటర్నెట్‌ సెర్చ్‌ చేసుకోవడం, మ్యూజిక్‌ ప్లే చేయడం, వీడియోలు చూడటం వంటివి చేసుకోవచ్చు.
  • ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్‌ఫర్మేషన్‌, ఇతర ముఖ్యమైన సర్వీసుల యాక్సస్‌ను పొందవచ్చు. 
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుట్ర జరుగుతోంది..  జోక్యం చేసుకోండి 

స్వల్ప లాభాలతో సరి.. 

ఎల్‌అండ్‌టీ ఇన్ఫో లాభం 33% వృద్ధి 

కార్వీ ట్రేడింగ్‌లో 40 శాతం యాప్‌తోనే 

ఏడాదిలో 2,000  మంది నియామకం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహాలక్ష్మి ముస్తాబు

దోషం ఎవరికి?

ప్రమోషన్స్‌ ఎంజాయ్‌ చేయలేను

గన్‌ టు గన్‌

వాళ్ల అంతు చూస్తా

మరో భారతీయుడు