జియో ఫైబర్‌ సేవలు దీపావళి నుంచే!

30 May, 2017 14:14 IST|Sakshi
జియో ఫైబర్‌ సేవలు దీపావళి నుంచే!

అన్‌ లిమిటెడ్‌ అంటూ వాయిస్‌, డేటా సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు సంబంధించి ఫైబర్‌ సేవల్లో ప్రవేశించి   టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు పుట్టించనుంది. జియో పై  సేవలపై ఇప్పటికే  పలు అంచనాలు మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా టెలికాం పరిశ్రమలో  పలు  టారిఫ్ సమీక్షలకు నాందిపలికిన జియో  బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం జియో ఫైబర్‌పై భారీ క్రేజ్ నెలకొంది.   ఈ నేపథ్యంలో  భారీ ఆఫర్‌తో ఈ దీపావళినాటికి జియో తన తన కొత్త 'జియోఫైబర్' అందజేయడానికి సిద్ధంగా  ఉందని తెలుస్తోంది.  రూ.500 బేసిక్‌ ప్లాన్‌లో 100  జీబీ డేటాను అందించనుంది.   
ఆన్‌లైన్ రిపోర్టు ప్రకారం దీపావళి సీజన్‌ నాటికి వాణిజ్య సేవలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందట. మీడియా నివేదికల ప్రకారం బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లలో జియో మీడియా  షేర్‌ డివైస్, స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, రౌటర్లు  ఇతర  పవర్ లైన్ కమ్యూనికేషన్ డివైస్‌లతో  తన సేవలను ప్రారంభించనుంది.  రూ.500 ప్లాన్‌లో  600జీబీ  డేటా సేవలు  ప్రారంభంకానున్నాయి.  100ఎంబీపీఎస్‌ వేగంతో 1000జీబీ  డేటాను అందించ నుంది. దీనికిగాను చందాదారులు ఒక నెలకి 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నివేదించింది.

మరోవైపు జియో ఎఫెక్ట్‌ తో  బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో వున్న టెలికాం మేజర్లు ఎయిర్‌టెల్‌,  బీఎస్‌ఎన్‌ఎల్‌   ప్రణాళికలను అప్‌డేట్‌ చేస్తున్నాయి.

కాగా  ముంబయి, ఢిల్లీ-ఎన్సిఆర్, అహ్మదాబాద్, జామ్నగర్, సూరత్, వడోదరలోత మ  బ్రాడ్‌బ్యాడ్‌ సర్వీసులను  ప్రారంభించనున్నట్టు ఇటీవల  జియోఫైబర్  అధికారికంగా ప్రకటించింది.  'జియోఫైబర్' ఆఫర్ ద్వారా వినియోగదారులు మూడు నెలల అధిక-వేగవంతమైన ఇంటర్‌నెట్‌ను  అందించనున్నామని తెలిపింది.  అలాగే ల్యాండ్‌ లైన్‌ సర్వీసులను త్వరలోనే ప్రారంభించనుంది. అయితే ఈ వార్తలపై జియో ఇంకా స్పందించాల్సి ఉంది.  

 

>
మరిన్ని వార్తలు