ఎయిర్‌టెల్‌కు షాక్‌: జియో కొత్త అధ్యాయం

21 Nov, 2018 21:01 IST|Sakshi

రైల్వేస్‌కు సర్వీస్‌ ప్రొవైడర్‌గా రిలయన్స్‌ జియో

 జనవరి 1, 2019 నుంచి అమలు

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ టెలికాం రంగంలో సంచలనం  రేపిన రిలయన్స్‌ జియో​ ఇన్ఫోకామ్‌ మరో  కొత్త అధ్యాయానికి  శ్రీకారం చుట్టింది. భారతీయ రైల్వేకు సర్వీస్‌ ప్రొవైడర్‌గా  అవతరించింది. 2019, జనవరి 1నుంచి రైల్వేస్‌కు అధికారికంగా జియో తన సేవలను అందించనుంది.  టెలికం రంగంలో ప్రధాన ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ షాకిచ్చి మరీ ఈ డీల్‌ను సొంతం చేసింది. రిలయన్స్ జియో రైల్వేలోని ఉన్నతాదికారులు,కార్యదర్శి స్థాయి అధికారులలు, గ్రూప్‌ సీ సిబ్బంది ఇలా నాలుగు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది.  4జీ /3జీ కనెక్షన్లను అందిస్తుంది.  వారికి ఉచిత కాలింగ్‌ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

భారతీ ఎయిర్‌టెల్‌తో  ఉన్న ఆరు సంవత్సరాల ఒప్పందంలో ఈ డిసెంబర్‌ 31 న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని  జియోవైపు రైల్వే శాఖ మొగ్గు  చూపింది. తాజా ఒప‍్పందం ద్వారా తమ ఫోన్ బిల్లులు కనీసం 35 శాతం వరకు తగ్గుతాయని  సీనియర్ అధికారి ఒకరు  తెలిపారు.  సుమారు 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్ల కోసం రైల్వేలు సంవత్సరానికి రూ. 100 కోట్ల బిల్లును చెల్లించినట్టు చెప్పారు.

>
మరిన్ని వార్తలు