జియో ఫోన్‌ కూడా పేలిందట..!

23 Oct, 2017 13:37 IST|Sakshi


కశ్మీర్‌: దీపావళి పండుగకు  జియో కస్టమర్ల చేతుల్లో మెరిసిన రిలయన్స్‌ జియో ఫీచర్‌ ఫోన్‌కు  సంబంధించి షాకింగ్‌ న్యూస్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది.  కశ్మీర్‌ లో ఒక జియోఫోన్ యూనిట్ పేలిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో  శాంసంగ్‌, షావోమీ, ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ పేలుళ్ల ఉదంతాలు సంచలనం సృష్టించగా ఇపుడు జియో ఫీచర్‌ ఫోన్‌ పేలుడు ఘటన మరింత కలకలం రేపింది

ఫోన్‌ రాడార్‌  అందించిన  నివేదిక ప్రకారం చార్జింగ్‌ లో ఉండగా  జియో ఫీచర్‌ పోన్‌ వెనుక  భాగంలో పేలింది. దీంతో  ఈ హ్యాండ్‌సెట్‌  వెనుగ భాగం పూర్తిగా మండి, కరిపోయినట్టు రిపోర్ట్‌ చేసింది. అయితే ముందుభాగం,  బ్యాటరీ మాత్రం చెక్కుచెదరలేదని నివేదించింది. 

ఈ ప్రమాదం తమ దృష్టికి వచ్చిందని, అయితే జియో ఫీచర్‌ ఫోన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్టు రిలయన్స్‌ రీటైల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. విడుదలకు ముందు ప్రతీ ఫోన్‌ను క్షుణ్ణంగా పరీక్షించినట్టు తెలిపింది.  కావాలని సృష్టించిన వివాదంగా తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని వాదించింది.  దీనిపై తదుపరి పరిశోధనల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని తెలిపింది.
మరోవైపు తప్పు బ్యాటరీది కాదని లైఫ్ డిస్ట్రిబ్యూటర్  పేర్కొంది.  పేలుడు తర్వాత కూడా యూనిట్ బ్యాటరీ ఇప్పటికీ పనిచేస్తుందని, ఈ సంఘటన ఉద్దేశపూర్వక ప్రయత్నమని  వ్యాఖ్యానించిందని కూడా ఈ నివేదిక పేర్కొంది. 

మరిన్ని వార్తలు