స్వచ్ఛ భారత్‌ కోసం రిలయన్స్‌ మెగా ప్లాగింగ్‌

5 Dec, 2019 20:06 IST|Sakshi

ప్లాగింగ్ అంటే జాగింగ్‌ చేస్తూ చెత్తను ఏరివేయడం 

50 నగరాల్లో రిలయన్స్‌ లిట్టర్‌ ఫీ  ఇండియా ప్లాగింగ్‌ రన్‌ 

మొదటి ప్లాగర్‌ రిపుదామన్‌తో  తొలి ప్లాగింగ్‌ రన్‌

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ను చెత్తరహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్‌ కు చెందిన ఆర్‌ ఎలాన్ (ఫ్యాబ్రిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ సంస్థ) చేపట్టిన రన్ విజయవంతం అయింది. భారతదేశపు మొదటి ప్లాగర్ రిపు దామన్‌ భాగస్వామ్యంతో అటు పర్యావరణ పరిరక్షణ ఇటు ఫిట్‌నెస్‌ను సాధించే ఉమ్మడి లక్ష్యంతో చేపట్టిన ప్లాగింగ్ రన్‌ను గురువారం విజయవంతంగా ముగించింది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ గ్రాండ్‌ఫినాలేకు కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు కూడా  హజరయ్యారు.

50 నగరాల ప్రజలు ఈ రన్‌‌లో పాల్గొన్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్‌ఎలాన్ సంస్థ వెల్లడించింది. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేందుకు సెప్టెంబర్ 5న కొచ్చిలో ప్రారంభమైన ఈ రన్‌ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తి అయిందని, ఈ సందర్భంగా తమకు  ఘనస్వాగతం లభించిందని తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా తదితర 50 నగరాల్లో సుమారు 1000 కిలోమీటర్ల మేర  కొనసాగిన ఈ మెగా రన్‌లో సుమారు 2.7 టన్నుల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ‘రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ' కార్యక్రమంపై ప్లాగర్‌ దామన్‌ స్పందిస్తూ ఇది డ్రీమ్ రన్ అని పేర్కొన్నారు. తమ ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత క్రీడా అథారిటీ గుర్తించడం గర్వంగా ఉందని దామన్ అన్నారు. ఆర్ఐఎల్‌ పాలిస్టర్ బిజినెస్ సీఈవో గుంజన్ శర్మ మాట్లాడుతూ ఈ ప్లాగింగ్‌ రన్‌ దేశవ్యాప్తంగా లభించిన ఆదరణ తమకెంతో సంతోషానిచ్చిం దన్నారు. పర్యావరణంపై అవగాహనతోపాటు, పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందింస్తామన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్‌తో అద్భుతమైన దుస్తులను తయారుచేస్తామని వెల్లడించారు.

కాగా రి లయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్ అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తుంది.  ప్లాంట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ లోని ప్లాంట్‌ ద్వారా ప్రతి ఏటా ఈ యూనిట్ 2.5 బిలియన్ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేస్తుంది. దీన్ని పర్యావరణహితమైన గ్రీన్ గోల్డ్ ఫైబర్‌గా మారుస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా