విమాన ప్రయాణీకులకు ఊరట

22 May, 2018 14:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తడిచి మోపెడవుతున్న కాన్సిలేషన్‌ చార్జీలతో  ఇబ్బందులుపడుతున్న విమాన ప్రయాణికులకు  విమానయాన శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.   విమాన టికెట్లను బుక్‌ చేసుకున్న 24 గంటలలోపు కాన్సిల్‌ చేసుకుంటే   ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా   మంగళవారం  వెల్లడించారు.  కొత్తగా ఎయిర్‌ సేవా  డిజి యాత్రా పథకాన్ని లాంచ్‌ చేయనున్నట్టు తెలిపారు.
 

కొన్ని సంస్కరణలపై   తాజా ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

  • బుకింగ్‌  చేసుకున్న 24 గంటల్లో టిక్కెట్లను రద్దు చేసుకుంటే..చార్జి ఉండదు.  
  • బేస్ ఫేర్ +ఇంధన చార్జీని మించి కాన్సిలేషన్‌ చార్జీలు ఉండకూడదు.  
  • ప్రత్యేక అవసరాలతో  ప్రయాణించేవారికోసం ప్రత్యేక సదుపాయం.
  • విమాన ఆలస్యంలో ఎయిర్‌లైన్స్‌  తప్పు ఉంటే  విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
  • నాలుగు గంటలకు మించి ఆలస్యమైతే పూర్తి ఫీజు వాపసు.
  • ఆలస్యం ఒకరోజు దాటితే ప్రయాణికులకు హోటల్‌లో బస తదితర సౌకర్యాలు కల్పించాలి.
  • టికెట్‌ బుకింగ్‌నకు ఆధార్‌ తప్పని కాదు. అయితే డిజీ యాత్రలో  నమోదు సమయంలో మాత్రమే  ఆధార్‌ అవసరమవుతుందనీ,  డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టామని  జయంత్ సిన్హా తెలిపారు.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు