మీటూ: మాజీ ప్రపంచ సుందరికి భారీ ఊరట

19 Nov, 2018 21:02 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్‌కు భారీ ఊరట లభించింది.  కోకా కోలా కంపెనీ నుంచి పరిహారంగా లభించిన మొత్తంపై పన్ను చెల్లింపుపై  ఇన్‌కం టాక్స్‌  అప్పెల్లా ట్రిబ్యునల్  (ఐటీఏటి) ఉపశమనం  కల్పించింది. నష్టపరిహారంగా వచ్చిన  ఆదాయంగా చూడలేమని దీనిపై పన్నుచెల్లించాల్సిన అవసరంలేదని  ట్రిబ్యునల్‌  తేల్చి చెప్పింది.  ఈ నేపథ్యంలో సుస్మితా సేన్‌కు లైంగిక వేధింపుల కేసులో నష్టపరిహారంగా వచ్చిన రూ.95లక్షలు ఆదాయం కిందికి రాదని  వెల్లడించింది. కాబట్టి పన్నుకట్టనక్కలేదంటూ  ఆమెపై విధించిన  రూ. 35 లక్షల జరిమానాను కొట్టి వేసింది.  ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28ప్రకారం , 2(24) పరిహారాన్ని  ఆదాయంగా పేర్కొనలేమని  ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

కోకా కోలా ఇండియా ఉద్యోగిపై లైంగిక ఆరోపణ కేసులో 2003-04లో, సుస్మితా సేన్‌క కంపెనీ   రూ. 1.45 కోట్లు చెల్లించింది. ఇందులో 50లక్షల రూపాయల ఆదాయపన్ను కింద మినహాయించి  రూ. 95 లక్షల నష్టపరిహారాన్ని సుస్మితా అందుకున్నారు. అయితే దీన్ని సుస్మితా సేన్‌   ఐటీ ఫైలింగ్‌లో  ప్రకటించలేదంటూ ఆదాయన పన్నుశాఖ పెనాల్టీ విధించింది.

మరిన్ని వార్తలు