బడ్జెట్‌ ధరలో ‘రెనాల్ట్ ట్రైబర్’ వచ్చేసింది

28 Aug, 2019 17:28 IST|Sakshi

ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్‌ మొట్టమొదటి మల్టీపర్పస్ వెహికల్ (ఎంపివి)ని లాంచ్‌ చేసింది. రెనాల్ట్ ట్రైబర్ పేరుతో దీన్ని భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రెనాల్ట్‌ క్విడ్‌ తరువాత రెండవ మోడల్‌గా దీన్ని తీసుకొచ్చింది. భారత్‌లో ఎక్స్ షోరూం ధర  బేసిక్‌  మోడల్‌ ధర రూ.4.95 -టాప్ ఎండ్ వేరియంట్  ధర 6.49 లక్షలుగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడు సీట్లతో అందుబాటులోకి వచ్చిన రెనాల్ట్‌  ట్రైబర్‌ను నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది.

రెనాల్ట్‌ ట్రైబర్‌ నాలుగు వేరియంట్లు-ధరలు
ఆర్‌ఎక్స్‌‌ఈ ధర రూ.4.95 లక్షలు
ఆర్‌ఎక్స్‌ఎల్ ధర రూ.5.49 లక్షలు
ఆర్‌ఎక్స్‌టీ ధర రూ.5.99 లక్షలు
ఆర్‌ఎక్స్‌జెడ్ ధర 6.49 లక్షలు


ఇక ఫీచర్ల విషయానికి వస్తే  1.0   లీటర్‌, 3 సిలిండర్‌ పెట్రోలక్ష ఇంజీన్‌, 5 స్పీడ్‌ మాన్యుల్‌ ట్రాన్స్‌మిషన్‌, 72 పవర్‌, 96 గరిష్ట్‌ టార్క్‌,  నాలుగుఎయిర్‌బ్యాగ్స్‌,  సులువుగా సీట్ల ఎరేంజ్‌మెంట్‌,   8 అంగుళాల మల్టీ మీడియా టచ్‌ స్క్రీన్‌  ప్రధానంగా ఉన్నాయి. 625 లీటర్ల బూట్ స్పేస్ సదుపాయం ఉండగా.. 6 సీట్ల కారులో 320 లీటర్ల బూట్ స్పేస్, 7 సీట్ల కారులో 84 లీటర్ల స్పేస్ ఉండనుంది. క్యాబిన్ స్టోరేజీ 31 లీటర్ల వరకు ఉండనుంది. డస్టర్‌,  క్యాప్చర్‌ లాంటి ఎస్‌యూవీలలో అందిస్తున్న ఫీచర్లను ఎంపీవీ ట్రైబర్‌లో జోడించామని రెనాల్ట్‌  సీఎండీ వెంకటరాం తెలిపారు.  రానున్న మూడేళ్లలో  ఇండియాలో రెండు లక్షల కార్లను అమ్మాలని లక్ష్యంగా  పెట్టుకున్నట్టు చెప్పారు. 

కాగా   రెనాల్ట్‌  ట్రైబర్‌  కారు టయోటా ఇన్నోవా, మారుతి ఎర్టిగా కు సరిపోలిన ఫీచర్లతో,  వాటి ధరతో పోలిస్తే  తక్కువ ధరలో అందుబాటులో గట్టి పోటీ  ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు