డీజిల్‌ వాహనాలకు రెనో గుడ్‌బై!

20 Jun, 2019 11:15 IST|Sakshi

క్రమంగా నిలిపేస్తామని ప్రకటన 

‘ట్రైబర్‌’ కాంపాక్ట్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌–6 నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో డీజిల్‌ వాహన విక్రయాలను క్రమంగా నిలిపివేయనున్నట్లు ఫ్రెంచ్‌ ఆటో దిగ్గజం రెనో బుధవారం ప్రకటించింది. ట్రైబర్‌ కాంపాక్ట్‌ 7–సీటర్‌ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించిన ఈ సంస్థ.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఈ కారులో కూడా ఎలక్ట్రిక్‌ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కారు 1–లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో లభిస్తుండగా.. ఈ ఏడా ది ద్వితీయార్థం నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ట్రైబర్‌ కాంపాక్ట్‌ ధరల శ్రేణి రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉండనుందని తెలిపింది.

మరిన్ని వార్తలు