మూడు కోట్ల మంది ముందుకొచ్చారు..

30 Jul, 2018 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐటీ) రిటన్స్‌ దాఖలు చేసిన వారి సంఖ్య రెట్టింపై దాదాపు 3 కోట్లకు పెరిగింది. పరిష్కరించిన రిఫండ్‌ కేసుల సంఖ్య కూడా 81 శాతం పెరిగి 65 లక్షలకు చేరుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది 60 శాతం వరకూ ఆన్‌లైన్‌లో రిటన్స్‌ దాఖలు కాగా వాటి ప్రాసెసింగ్‌ కూడా ఇప్పటికే చేపట్టినట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. మరోవైపు సామాన్య ప్రజలకు ఊరటగా ఆదాయ పన్ను శాఖ పన్ను రిటన్స్‌ దాఖలు చేసే తుది గడువును నెల రోజులు పొడిగించింది.

ఆగస్టు 31 వరకూ ఐటీ రిటన్స్‌ దాఖలు చేసేందుకు డెడ్‌లైన్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఐటీ రిటన్స్‌ దాఖలు చేసేందుకు తుది గడువును జులై 31 నుంచి ఆగస్ట్‌ 31 వరకూ పొడిగించిన నేపథ్యంలో పన్ను చెల్లింపులో జాప్యం చేయకుండా చట్టాన్ని గౌరవించే పౌరులుగా సకాలంలో పన్నులు చెల్లించి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు