10శాతం పెట్టుబడులకు విదేశీ బ్యాంకులకు అనుమతి

13 May, 2016 19:46 IST|Sakshi
10శాతం పెట్టుబడులకు విదేశీ బ్యాంకులకు అనుమతి

ముంబై : స్థానిక ప్రైవేట్ రుణదాతలకు, లైఫ్ ఇన్సూరెన్సె కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల్లో 10శాతం పెట్టుబడి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. మూలధనాన్ని, ఈ రంగంలో స్థిరీకరణను ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పాలసీలను సెంట్రల్ బ్యాంకు గురువారం ప్రకటించింది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకుల్లో 10శాతం వాటాను వ్యక్తులు, సంస్థలు పొందేలా అనుమతినిచ్చింది. నాన్ రెగ్యూలేటెడ్, నాన్ డైవర్సిఫైడ్, లిస్ట్ కాని ఫైనాన్సియల్ సంస్థలు 15శాతం వాటాను పొందేలా.. రెగ్యులేటెడ్, డైవర్సిఫైడ్, లిస్ట్ అయిన సంస్థలు 40శాతం వాటాను పొందేలా రిజర్వు బ్యాంకు ఈ కొత్త పాలసీను తీసుకొచ్చింది.

ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త పాలసీల వల్ల బ్యాంకింగ్ రంగంలో స్థిరీకరణ వస్తుందని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ పార్టనర్ కల్సేష్ మెహతా తెలిపారు. 2013లో కొత్త బ్యాంకు లైసెన్సులు జారీ వెలుగులోకి వచ్చినప్పటీ నుంచి ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో షేర్ హోల్డింగ్ మార్గదర్శకాలను పునఃసమీక్షిస్తున్నామని ఆర్బీఐ చెప్పింది. బేసల్-3 నిబంధనల అమలు మేరకు రుణదాతలకు అవసరమైనంత అదనపు మూలధనం అందించడానికి తోడ్పడుతున్నామని పేర్కొంది. ఒకవేళ బోర్డు అనుమతులు లభిస్తే, ఎలాంటి రెగ్యులేటరీ అభిప్రాయం అవసరం లేకుండానే పెట్టుబడిదారులు బ్యాంకుల్లో ఎక్కువ వాటా కలిగి ఉండేలా చేస్తామని చెప్పింది.

మరిన్ని వార్తలు