పరిశ్రమలు రయ్‌.. ధరల డౌన్‌

13 Sep, 2018 00:45 IST|Sakshi

 సానుకూల ఆర్థిక గణాంకాలు

జూలైలో ఐఐపీ 6.6 శాతం వృద్ధి

ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 

11 నెలల కనిష్టం

3.69 శాతంగా నమోదు  

న్యూఢిల్లీ: జూలై, ఆగస్టులో సానుకూలమైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదయ్యాయి. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. ఇక ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. 11 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. అక్టోబర్‌ 5న పాలసీ సమీక్ష జరగనుంది కూడా. గతేడాది జూలైలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం ఒక శాతమే. అయితే నెలవారీగా చూస్తే ఐఐపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది.  

మెరిసిన తయారీ, క్యాపిటల్‌ గూడ్స్‌... 
తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు జూలైలో భారీగా 7 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 22 సానుకూల ఫలితాలను అందించాయి. కాగా గత ఏడాది ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాత క్షీణత నమోదయింది. 
కన్సూమర్‌ డ్యూరబుల్స్‌: వృద్ధి రేటు భారీగా 14.4 శాతంగా నమోదయింది. గత ఏడాది జూలైలో –2.4 శాతం క్షీణత నమోదయింది.  
క్యాపిటల్‌ గూడ్స్‌: డిమాండ్‌కు, భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ రంగం 3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2017 జూలైలో ఈ విభాగం –1.1 శాతం క్షీణత కనిపించింది. 
విద్యుత్‌: జూలైలో స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది.  
నాలుగు నెలల్లో..: ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 1.7% నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగం వృద్ధి ఈ నెలల్లో 1.2 శాతం నుంచి 5.6 శాతానికి పెరిగింది.

వాణిజ్యలోటు భయాలు..
గస్టులో 17.4 బిలియన్‌ డాలర్లు
న్యూఢిల్లీ: దేశంపై వాణిజ్యలోటు భయాలు తీవ్రమయ్యాయి. ఆగస్టులో ఏకంగా 17.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు నమోదయ్యింది. ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. 2018 ఆగస్టులో ఎగుమతులు 19.21 శాతం వృద్ధిని (2017 ఆగస్టుతో పోల్చితే) నమోదు చేసుకున్నాయి. విలువ రూపంలో ఈ ఎగుమతుల పరిమాణం 27.84 బిలియన్‌ డాలర్లు. అయితే దిగుమతులు కూడా భారీగా 25.41 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 45.24 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 17.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో దిగుమతుల బిల్లు భారం భారీగా  పెరగడానికి అంతర్జాతీయ చమురు ధరల తీవ్రత కారణం. వాణిజ్యలోటు తీవ్రత కూడా డాలర్‌ మారకంలో  రూపాయి విలువ 70 దిగువకు పడిపోవడానికి ప్రధాన కారణం.

7% తగ్గిన కూరగాయల ధరలు..
రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.69%గా నమోదైంది. కూరగాయల ధరలు 7% తగ్గాయి. 6 విభాగాల్లో ఒకటైన ఆహారం పానీయాల విభాగంలో కూరగాయలతో పాటు పప్పులు (–7.76%), చక్కెర, తీపి ఉత్పత్తుల(–5.45%) తగ్గాయి. గుడ్ల ధరలు 6.96% పెరిగాయి. మాంసం, చేపలు (3.21%), పాలు, పాల ఉత్పత్తులు (2.66%), చమురు, ఫ్యాట్స్‌ (3.47%), పండ్లు (3.57%), ఆల్కహాలేతర పానీయాలు (1.86%) ధరలు స్వల్పంగా పెరిగాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సొనాటా’ వెడ్డింగ్‌ కలెక్షన్‌

భవిష్యత్తు అల్యూమినియం ప్యాకేజింగ్‌దే: ఏబీసీఏఐ

నేను చేసిన పెద్ద తప్పు అదే: బిల్‌గేట్స్‌

టేబులే.. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌!

ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!

పాత కారు.. యమా జోరు!!

ట్రేడ్‌ వార్‌ భయాలు : పసిడి పరుగు

గుడ్‌న్యూస్‌ : 20 రోజుల్లో 20 స్మార్ట్‌ఫోన్లు ఫ్రీ

నష్టాలకు చెక్‌: భారీ లాభాలు

తాగి నడిపితే..ఇకపై రూ.10 వేలు ఫైన్‌!

350 పాయింట్లు జంప్‌ చేసిన స్టాక్‌మార్కెట్లు

సమోసా, కచోరీలతో కోట్లకు కొలువుతీరి..

మెహుల్‌ చోక్సీకి షాక్‌

64 మెగాపిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌

బడ్జెట్‌లో తీపి కబురు ఉండేనా..?

ఆధార్‌ ప్రింట్‌ చేసినట్టు కాదు..!

వివాదాల ‘విరాళ్‌’... గుడ్‌బై!

సగం ధరకే ఫ్యాషన్‌ దుస్తులు

1.76 లక్షల ఉద్యోగులకు మరోసారి షాక్‌!

బిన్నీబన్సల్‌ అనూహ్య నిర్ణయం 

చివరికి నష్టాలే..,

నష్టాల బాట : ఆటో, మెటల్‌ టౌన్‌

అమెరికా వర్సెస్‌ ఇండియా? కాదు కాదు..

మొబైల్‌ యాప్స్‌ నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఫార్మా ఫండ్‌

మిడ్‌క్యాప్‌లో లాభాల కోసం...

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ ప్రారంభం

‘కియా’ చౌకధర ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

మేఘాకు జాక్‌పాట్‌

ఆ కోరిక ఇంకా తీరనేలేదు!

గిల్టీ ఫీలింగ్‌తో...

జగపతిబాబు@ స్కార్‌ రవిశంకర్@ ముఫార్‌

మరో రీమేక్‌లో?