6 నెలల గరిష్టం  అయినా... అదుపులోనే! 

14 May, 2019 04:56 IST|Sakshi

ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.92 శాతం

ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యం 4 శాతం 

ఇదే తీరు కొనసాగితే  మరోదఫా రేటు కోత 

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.92 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 ఏప్రిల్‌లో సూచీలోని వస్తువుల బాస్కెట్‌ ధర 2019 ఏప్రిల్‌లో 2.92 శాతం పెరిగిందన్నమాట. ఈ స్థాయిలో రిటైల్‌ ధరల స్పీడ్‌ నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. అయితే ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యం 4 శాతం లోపే ఉండడం గమనార్హం. మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్‌బీఐ మరోదఫా రేటు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 6 శాతం) తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లుసహా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల ఏప్రిల్‌లో ధరల స్పీడ్‌ కొంత పెరిగింది. కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 

►మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.86 శాతం ఉంటే, 2018 ఏప్రిల్‌లో 4.58 శాతంగా ఉంది.  
►  అక్టోబర్‌ 2018 తరువాత (3.38%) ఈ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారి.  
►  ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే, ధరలు 1.1% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల రేటు కేవలం 0.3%. కూరగాయల ధరలు 2.87% పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం గత ఏడాది ఏప్రిల్‌ నుంచి 2019 ఏప్రిల్‌ను చూస్తే తగ్గాయి.  
► ఇంధనం, లైట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం 2.42 శాతం నుంచి 2.56 శాతానికి పెరిగింది.  
►కాగా గ్రామీణ భారతంలో ధరల స్పీడ్‌ మార్చిలో 1.8 శాతం ఉంటే, ఏప్రిల్‌లో ఇది 1.87 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 4.1 శాతం నుంచి 4.23 శాతానికి చేరింది.  
► నిర్దేశిత కొన్ని పట్టణాలు, గ్రామాల నుంచి ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఫీల్డ్‌ ఆపరేషన్స్‌ డివిజన్ల నుండి ఈ గణాంకాలను సేకరించడం జరుగుతుంది.  

2019–2020లో 4 శాతం 
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకూ) రిటైల్‌ ద్రవ్యోల్బణం  రేటు సగటున 4 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు క్రిసిల్‌ రిసెర్చ్‌ అంచనావేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3.4 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు ఉండడం తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డులు

బయోకాన్‌ భళా!

4 శాతం ఎగిసిన బజాజ్‌ ఆటో ఆదాయం

ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు

నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

బీఓబీ లాభం రూ.826 కోట్లు

టాటా మోటార్స్‌ నష్టాలు 3,679 కోట్లు

డిసెంబర్‌ నాటికి వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు

జెట్‌ రేసులో ఇండిగో!

ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు 

చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు

రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ

వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

ఎగవేతదారులను వదలొద్దు

బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

‘ఇన్నోవేషన్‌’లో భారత్‌కు 52వ ర్యాంకు

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

10 వేల ఉద్యోగాలకు ఎసరు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

భారత పారిశ్రామికవేత్త అరెస్ట్‌

ఆర్‌బీఐ ‘ఉత్కర్ష్‌ 2022’

నిలిచిపోయిన ముకేశ్‌ డీల్‌..!

కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

‘59 మినిట్స్‌’తో రూ. 5 కోట్లు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...