30 రోజుల్లోనే పన్ను ఫిర్యాదుల పరిష్కారం

4 Jan, 2017 01:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ రీఫండ్‌ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన 30 రోజుల్లోగానే అధికారులు పరిష్కరించాలని ఆదాయ పన్ను విభాగం ఆదేశించింది. రీఫండ్‌లు, పాన్‌ కార్డు లేదా ఇతరత్రా ఆదాయ పన్ను సంబంధ ఫిర్యాదులు ఏ స్థాయిలోనూ 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదంటూ పేర్కొంది.

కొత్తగా ఏర్పాటైన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ పేయర్‌ సర్వీసెస్‌ (డీటీపీఎస్‌) ఈ మేరకు ఐటీ ప్రాంతీయ కార్యాలయాల అధిపతులకు సూచించింది. ఆయా ఫిర్యాదులకు సంబంధించిన అధికారిని గుర్తించలేకపోవడం, తాజాగా వచ్చిన సూచనల గురించి అవగాహన లేకపోవడమే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి కారణమవుతున్నాయని పేర్కొంది. ఒకవేళ సీబీడీటీ ఆదేశించిన అథారిటీ పరిధిలోకి రాని అంశమైన పక్షంలో .. దాన్ని అయిదు రోజుల్లోగా వెనక్కి పంపాలని తెలిపింది.

మరిన్ని వార్తలు