ఇండియా, రిలయన్స్‌ రైజింగ్‌.. ఎవ్వరూ ఆపలేరు!

12 Aug, 2019 11:23 IST|Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్‌ అధినేత, సీఎండీ ముకేశ్‌ అంబానీ సహా, ఆయన కుటుంబం ఈ మీటింగ్‌కు తరలి  వచ్చింది. ముఖ్యంగా ముకేశ్‌ అంబానీ తల్లి,  భార్య నీతూ అంబానీ,  కుమార్తె ఈషా,  కుమారుడు ఆకాశ్‌ అంబానీతోపాటు  కీలక వాటాదారులు, ఇతర ప్రమోటర్లు హాజరయ్యారు. 

అధినేత ముకేశ్‌ అంబానీ వాటాదారులనుద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో అత్యున్నత విలువగల కంపెనీగా  రిలయన్స్‌ తన సత్తా చాటుదోందని, భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భూమికను పోషిస్తోందని తెలిపారు. రిలయన్స్‌ వృద్ధి, అలాగే భారత ఆర్థికవ్యవస్థ  ప్రస్తుతం ఉన్నంత ప్రకాశవంతంగా ఇంతకుముందెన్నడూ కనిపించలేదని అంబానీ పేర్కొన్నారు. ఇండియా వృద్ధిని,  రిలయన్స్‌ ఎదుగుదలను ఆపడం ఎవ్వరి తరమూ కాదని ఆయన వెల్లడించారు. న్యూ ఇండియా, న్యూ రిలయన్స్‌ అనే నినాదాన్నిచ్చారు.  ఈ సందర్భంగా  రిలయన్స్‌, బీపీ  ఒప్పందాన్ని ప్రస్తావించారు. రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుంది  బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని ముఖేశ్ స్పష్టం చేశారు.  జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం. రిలయన్స్  భవిష్యత్తు ప్రణాళికలపై అంబానీ చేయనున్న ప్రకటనలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

 అంబానీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు :

  • 2030 నాటికి భారత ఎకానమీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
  • రిలయన్స్ పెట్రోలియంతో బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ‘బీపీ ఆయిల్ ఇండస్ట్రీ’ చేతులు కలపబోతోంది.
  • సౌదీ కంపెనీ ఆరామ్కో 20 శాతం పెట్టుబడులు .
  • భారతీయులు డిజిటల్‌పై ఏటా రూ.5లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానిలో భాగంగా జియో రూ.3.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. 
  • జియో మూడేళ్లు పూర్తి చేసుకోబోతోంది. 
  • వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం.
  • జియో వినియోగదారులకు  ప్రత్యేక ధన్యవాదాలు.  మీ అందరి ప్రోత్సాహంతోనే ఈ ఘనతను సాధించాం.
  • ప్రతి నెల కోటి మంది వినియోగదారులు కొత్తగా జియోలో చేరుతున్నారు. 
  •  రూ. 700 - రూ. 10వేల మధ్య జియో గిగా ఫైబర్‌ తారిఫ్స్‌  - ముకేశ్‌ అంబానీ 
  • రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుంది  బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని ముకేశ్‌ స్పష్టం చేశారు.  జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తాం.
  •  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థన మేరకు జమ్ము కశ్మీర్‌, లదాఖ్‌ను అభివృద్ధికి కృషి చేస్తాం.  దీనికి సంబంధించి  తమ ప్రణాళికను రానున్న రోజుల్లో ప్రకటిస్తాం.
  •  ఆరామ్‌కో మెగా డీల్‌ : రిలయన్స్‌ చమురు, కెమికల్ బిజినెస్‌లో 20 శాతం విదేశీ పెట్టుబడులను పెట్టబోతున్నట్లు  అంబానీ ప్రకటించారు. మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సౌదీ అరామ్‌కో ద్వారా రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. 
  •  మైక్రోసాఫ్ట్‌తో జత:

  • భారతీయుల డేటా ప్రైవసీ కోసం బ్లాక్‌చైన్ వ్యవస్థను తీసుకొస్తున్నాం. జియో డేటా సెంటర్ల కోసం మైక్రోసాఫ్ట్‌తో జతకడుతున్నామని అంబానీ వివరించారు. ‘అజుర్ ప్లాట్‌ఫాం’ను మైక్రోసాఫ్ట్ అందజేయనున్నాము. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌  సీఈవో సత్యనాదెళ్ల  వీడియో బైట్‌ ప్లే చేశారు. అంతేకాదు దేశీయంగా స్టార్టప్స్‌కు జియో పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు 2020, జనవరిలో  దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్  ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. 

ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ

జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు ఈషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.   సరికొత్త ఎంఆర్ (మిక్స్‌డ్ రియాలిటీ) హెడ్ సెట్స్ ఓ స్టార్టప్ డెలవప్ చేసింది. ఇందులో జియో పెట్టుబడి పెట్టిందని , ఇది త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందంటూ  చెప్పుకొచ్చారు.  గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్,  వీఆర్ తో షాపింగ్‌ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే  మనకు సరిపడే దుస్తుల షాపింగ్  చేయవచ్చని తెలిపారు.  అంతేకాదు ఇంట్లో థియేటర్‌ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా  చూపించారు. 


  • జియో గిగా  పైబర్‌ ఫీచర్లు 
  •  మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్‌ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చు. 
  • ప్రపంచంలో  ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్‌,  కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు.
  •  వార్షిక ప్లాన్‌ ఎంచుకున్న వారికి 4కే  ఎల్‌ఈడీ టీవీ, 4జీ సెట్‌టాప్‌బాక్స్‌ ఉచితం.
  • సెప్టెంబరు 5న  ఫైబర్‌ సేవలులాంచ్‌,  జియో.కాం ద్వారా పూర్తి వివరాలు సెస్టెంబరు 5 నుంచి.

>
మరిన్ని వార్తలు