రికార్డ్‌ స్థాయికి ఆర్‌ఐఎల్‌

30 Jul, 2018 17:37 IST|Sakshi

సాక్షి, ముంబై:  అటు ఫలితాల జోష్‌, ఇటు ఎనలిస్టుల అంచనాల నేపథ్యంలో సోమవారం నాటి బుల్‌ మార్కెట్‌లో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  షేరు కూడా రికార్డు   స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు   ఆర్‌ఐఎల్‌ కౌంటర్లో కొనుగోళ్ల వైపు మొగ్గు  చూపారు. దీంతో ఇంట్రాడేలో రెండున్నర శాతం లాభపడి ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరింది. రూ. 1157వద్ద సరికొత్త రికార్డు ఆర్‌ఐఎల్‌ క్రియేట్‌ చేసింది.  1991, జనవరి తరువాత ఇదే అదిపెద్ద లాభమని విశ్లేషకులు  తెలిపారు.

మరోవైపు   గోల్డ్‌మన్‌ సాచే, మోర్గాన్‌ స్టా‍న్లీ, మోతీలాల్‌,  నోమురా, ఎడిల్‌వీస్‌ తదితర  బ్రోకరేజ్‌ సంస్థ లన్నీ బై రేటింగ్‌ను  ఇచ్చాయి.  ఆర్‌ఐఎల్‌ షేరు  ప్రైస్‌ టార్గెట్‌ను 1200నుంచి 1400వరకు జంప్‌ చేయవచ్చని అంచనా వేశాయి. కాగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ 8శాతం స్టాండలోన్‌ నికరలాభాన్ని నమోదు చేసింది. ఆర్‌ఐఎల్‌ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో క్యూ-1లో రూ.6.12 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు