డ్రైవర్ లెస్ లగ్జరీ కారు వచ్చేసింది

17 Jun, 2016 16:33 IST|Sakshi
డ్రైవర్ లెస్ లగ్జరీ కారు వచ్చేసింది

సూపర్ లగ్జరీ కారు మార్కెట్లో రోల్స్ రాయిస్ మరోసారి తళుక్కుమంది. తన మొదటి డ్రైవర్ లెస్ కారును గురువారం ఆవిష్కరించేసింది.  సులువైన ప్రయాణం, గ్రాండ్ సాన్చురీ, గ్రాండ్ అరైవల్ అనుభూతితో ఈ కారును జర్మన్ కార్ మేకర్ బిలినీయర్ల ముందుకు తెచ్చింది. ఆ కారుకు అసలు స్టీరింగ్ వీల్  ఉండదు. కేవలం ఒక్క వైపు మాత్రమే డోర్ ఉంటుంది.  కేవలం రెండే సీట్లతో.. చూడగానే చూపరులను కట్టిపడేసేలా వినూత్నంగా  ఈ కారును రోల్స్ రాయిస్ రూపొందించింది. వర్చ్యువల్ అసిస్టెంట్ తో హోటల్స్  బుక్ చేసుకోవడం లేదా వార్డ్రోబ్ ను సెలక్ట్ చేసుకోవడం అంతా ఈ కారు ద్వారానే చేసుకోవచ్చట. ఇప్పటికే చాలా కారు తయారీదారి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించాయి. కానీ రోల్స్ రాయిస్ మాత్రం మొదటిసారి ఈ కారును  వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఈ కారు ధర దాదాపు రూ.10 కోట్లని అంచనా.

న్యూ విజన్ 100 కాన్సెప్ట్ తో ఈ కారును రోల్స్ రాయిస్ తీసుకొచ్చింది. తన పేరెంట్ కంపెనీ బీఎమ్ డబ్ల్యూ సెంటనరీ వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో లండన్ ఈవెంట్ గా 103ఈఎక్స్ పేరుతో ఈ లగ్జరీ కారును రోల్స్ రాయిస్ ప్రవేశపెట్టింది. 3ఎంపీహెచ్ టాప్ స్పీడ్ సామర్థ్యం, మొబైల్ ఫోన్ తోనే ఈ కారును డ్రైవర్ ఆపరేట్ చేయడం దీని ప్రత్యేకతలు. 12 సిలిండర్ ఇంజిన్ ను ఈ కారు కలిగిఉంది. ప్రస్తుతమైతే జీరో ఉద్గారాలు ఉన్నాయని, కానీ 2040లో ఉత్పత్తి అయ్యే కార్లలో మాత్రం ఉద్గారాలు ఉండవు అనే దానికి తమ దగ్గర ఎలాంటి క్లారిటీ లేదని ఈ కొత్త జర్మన్ కారు తయారీదారు పేర్కొంది.

ఈ కారుకు డోర్ కేవలం ఒక్క వైపు మాత్రమే ఉండి, లేజర్ ప్రొజెక్టర్ ద్వారా ఈ కారు వచ్చేటప్పుడు ఫ్లోర్ పై వర్చ్యువల్ రెడ్ కార్పెట్ కనిపిస్తూ గ్రాండ్ వెల్ కమ్ అనుభూతిని కల్పిస్తుంది. అంతేకాదు లగేజీ బ్యాగ్ లను నియంత్రించే పనిని మనం ఏ మాత్రం   టచ్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఈ కారే చేసేస్తుంది. 1.5 మీటర్ స్క్రీన్ తో ఫిల్మ్ లను వీక్షిస్తూ గ్రాండ్ సాన్చురీ అనుభూతిని రోల్ రాయిస్ కల్పిస్తుంది.

మరిన్ని వార్తలు