రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులు వేలం

13 Dec, 2017 11:19 IST|Sakshi

ప్రముఖ మోటార్‌ సైకిల్‌ తయారీదారు రాయల్  ఎన్‌ఫీల్డ్‌  తన  పాపులర్‌  బైక్స్‌ను వేలం వేస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్లో ప్రారంభించిన   'ఫైట్ ఎగైనెస్ట్ టెర్రర్' లో భాగంగా తన పాపులర్‌  మోడల్‌  స్టీల్త్‌ బ్లాక్‌ క్లాసిక్‌ 500 వాహనాలకు ఆన్‌లైన్‌ లో వేలం నిర్వహిస్తోంది.  కొన్ని వారాల క్రితం, టెర్రరిజంపై అవగాహన కల్పిస్తూ  పదిహేనుమంది ఎన్ఎస్‌జీ కమాండోలు 13 రాష్ట్రాల్లో  8వేల కి.మీటర్ల రోడ్ ట్రిప్ నిర్వహించిన ఈ 15 బైకులను  వేలం ద్వారా విక్రయించనుంది. ఇలా వచ్చిన నిధును  ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళమివ్వనుంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వెబ్‌సైట్‌ అందించిన వివరాల ప్రకారం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ) ముఖ్య కమాండోలు ఉపయోగించిన 15 కంపెనీల వాహనాలను ఆన్‌లైన్ వేలం నేటి ప్రారంభం  కానుందని  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది.  ట్రిబ్యూట్‌ టు బ్రేవ్‌హార్ట్‌ పేరుతో ఈ సేల్‌ నిర్వహిస్తోంది.  వేలం తేదీకి ముందే కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో  ఆన్‌లైన్‌ నమోదు చేసుకున్నవారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి అర్హులు.  నమోదు చేసుకున్న అభ్యర్థులకు  కేటాయించిన  స్పెషల్‌  కోడ్‌ ద్వారా  వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.

 ఒక్కో బైకు ధరను రూ.1.9 లక్షలుగా నిర్ణయించింది.  ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును స్వచ్చంద సంస్థకు ఇవ్వనున్నట్టు  సం​స్థ తెలిపింది.   ఎన్‌ఎస్‌జీ మద్దతు ఇస్తున్న వికలాంగ  బాలల కోసం పాటుపడుతున్న  స్వచ్ఛంద సంస్థ ప్రేరణకు  ఈ మొత్తాన్ని  విరాళంగా  ఇస్తామని  చెప్పింది.

మరిన్ని వార్తలు