రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయకొత్త మోడల్‌ 

20 Jan, 2020 18:46 IST|Sakshi

బీఎస్ -6 హిమాలయన్‌ ప్రారంభ ధర రూ .1.86 లక్షలు

సాక్షి, న్యూఢిల్లీ : రాయల్ ఎన్‌ఫీల్డ్ రానున్న కొత్త ఉద్గార నిబంధనలకనుగుణంగా పాపులర్‌ మోడల్ హిమాలయను బైక్‌ను అప్‌డేట్‌ చేసింది. బీఎస్‌-6 ఇంజిన్‌తో  సోమవారం లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధర రూ .1.86 లక్షల (ఎక్స్‌షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంచినట్లు కంపనీ తెలిపింది. ఏబీఎస్‌ ఫీచర్‌తో మూడు రంగుల్లో  వీటిని తీసుకొచ్చింది.  411 సీసీ ఇంజీన్‌, 24.3 బీహెచ్‌పీ పవర్‌, 32 ఎన్‌ఎం టార్క్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించగా, మూడేళ్ల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది.

విలక్షణమైన అడ్వెంచర్ టూరర్ గా 2016 నుండి, హిమాలయ బైక్స్‌ జాతీయంగా అంతర్జాతీయంగా ఆదరణ పొందిందని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సీఈవో వినోద్ దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకమైన ఫీచర్స్, డిజైన్ ఫంక్షన్లతో కొత్త బిఎస్-6 హిమాలయన్ లాంచ్ చేయడం  దేశంలో అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్  కొత్త ప్రమాణాలను ఏర్పరచడంతోపాటు, రైడర్లను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని కంపెనీకి  కలిగిస్తోందన్నారు. తమ కొత్త బైక్స్‌ భారతదేశంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో లభిస్తాయని అన్నారు. అలాగే  హెల్మెట్లు, జెర్సీలు, టీ-షర్టులు, స్వెర్ట్‌షర్ట్స్‌,  హెడ్‌గేర్‌ తదితరాలను సరికొత్త గా తీసుకొస్తున్నట్టు చెప్పారు. 

 స్నో వైట్, గ్రానైట్  కలర్‌ ఆప్షన్‌ బైక్‌ ధర రూ .1,86,811 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం
 స్లీట్ గ్రే ,  గ్రావెల్ గ్రే మోడల్‌  ధర రూ .1,89,565 (ఎక్స్-షోరూమ్) 
 కొత్తగా వచ్చిన డ్యూయల్ టోన్ కలర్స్ - రాక్ రెడ్ , లేక్ బ్లూ - రూ .1,91,401 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి.

మరిన్ని వార్తలు