రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొత్త యూనిట్‌

28 Aug, 2017 11:48 IST|Sakshi

చెన్నై: ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ ఐషర్‌ మోటార్స్‌  ఇండియాలో మరో యూనిట్‌ ప్రారంభించింది.  ఐషర​  మోటార్స్ విభాగానికి చెందిన రాయల్ ఎన్‌ ఫీల్డ్‌  చెన్నై సమీపంలో  వల్లం వడగల్లో  కమర్షియల్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ను  ప్రారంభించింది.  

ఈ కొత్త ఉత్పాదన కేంద్రం నుంచి వాణిజ్య ఉత్పత్తిని  నేటి నుంచి ప్రారంభించింది. ఇక్కడినుంచి  ఇండియా మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ  మార్కెట్లు కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్‌  బైక్‌లను తయారు చేయనున్నామని ఐషర్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి దశలో సంవత్సరానికి 300,000 బైక్‌ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్నట్టు  తెలిపింది.

కాగా ఈ ప్లాంట్ తో రాయల్ ఎన్‌ ఫీల్డ్‌ కు ఇది మూడవ  ఉత్పత్తి కేంద్రం.  2018  ఆర్థికసంవత్సరానికి  గాను మొత్తం మూడు ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం 825,000 యూనిట్లుగా ఉంది.

 

మరిన్ని వార్తలు