‘దిల్‌కే రిస్తే’ ..మాట్రిమోనీలో వీడియోలు

25 Apr, 2019 01:10 IST|Sakshi

వీడియో మాట్రిమోనీని ఆరంభించిన ‘దిల్‌కే రిస్తే’  

హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: భారత్‌లో ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ వచ్చే ఏడాదికి రూ.1,200 కోట్లకు చేరుతుందని ‘దిల్‌కే రిస్తే’ వ్యవస్థాపకుడు సురేశ్‌ నాయర్‌ చెప్పారు. దేశంలో మొట్టమొదటి వీడియో మాట్రిమోనీ సైట్‌ ‘దిల్‌కేరిస్తే డాట్‌కామ్‌’ను ఆరంభించిన సందర్భంగా మాట్లాడుతూ‘‘ ప్రస్తుతం ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ విలువ రూ.1,000 కోట్లని, ఇందులో దాదాపు 80 శాతం వాటా టాప్‌ 3 సైట్లదేనని (భారత్‌ మాట్రిమోని, షాదీ, జీవన్‌సాథీ) చెప్పారు. మాట్రిమోనీ మార్కెట్లో ప్రస్తుతం దాదాపు 43 లక్షల మంది సభ్యులున్నారన్నారు. వచ్చే రెండేళ్లలో మొత్తం మాట్రిమోనీ మార్కెట్‌ రెవెన్యూలో 10 శాతం, సబ్‌స్క్రైబర్లలో 25 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలో జరిగే వివాహాల్లో మాట్రిమోనీ సైట్ల ద్వారా జరిగే వివాహాల శాతం కేవలం 6 శాతమేనని, ఈ రంగంలో విస్తరించేందుకు అపార అవకాశముందని వివరించారు. మాట్రిమోనీ సైట్‌ ప్రొఫైల్స్‌లో 60 శాతం వాటా మగవారిది కాగా, 40 శాతం ప్రొఫైల్స్‌ మహిళలవని తెలిపారు.  

తొలి వీడియో మాట్రిమోనీ సైట్‌ 
ఈ మార్కెట్లో ఇంతవరకు వీడియో ఆధారిత ప్రొఫైల్స్‌తో కూడిన మాట్రిమోనీ సైట్‌ లేదని, అందుకే తాము ప్రవేశపెట్టామని సురేశ్‌ నాయర్‌ తెలిపారు. తమ సైట్లో మొదటి మూడు నెలలు రిజిస్ట్రేషన్‌ ఉచితమన్నారు. సభ్యులు సొంతంగా 1– 1.5 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ప్రొఫెషనల్‌ వీడియో కావాలంటే రూ.6వేలు ఫీజుతో తాము తయారు చేసి అప్‌లోడ్‌ చేస్తామన్నారు. ఇందుకోసం నగరంలో తాము 11 స్టూడియోలు ఏర్పరిచామన్నారు. వీడియోలతో సభ్యుల గురించి అవతలవారికి సరైన అవగాహన వస్తుందన్నారు. తమ సైట్లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. నెంబర్‌ డిస్‌ప్లే చేయకుండా వీడియో కాలింగ్, ఆన్‌లైన్‌ చాటింగ్, హారోస్కోప్‌ మ్యాచింగ్‌ తదితర ప్రత్యేక సేవలను తమ సైట్లో అందిస్తున్నామన్నారు. తొలి ఏడాదిలో కనీసం 30వేల సభ్యులను లకి‡్ష్యస్తున్నామని తెలిపారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌