పీఎన్‌బీకి రూ.2 కోట్లు జరిమానా

27 Mar, 2019 00:04 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బ్యాంకుపై ఆర్‌బీఐ రూ.2 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌ అయిన ‘స్విఫ్ట్‌’ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆర్‌బీఐ ఈ పెనాల్టీని విధించినట్లు పీఎన్‌బీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
 

ఈ సాఫ్ట్‌వేర్‌ కార్యాచరణ లోపం కారణంగానే నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు రూ.14,000 కోట్ల కుంభకోణం చేయగలిగారని వివరణ ఇచ్చింది. ఇటీవలే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌ఎస్‌బీసీ, బీఓబీ, సిటీ బ్యాంక్, కెనరా బ్యాంక్, యస్‌ బ్యాంక్‌లపైనా ఆర్‌బీఐ ఇదే తరహా జరిమానాలను విధించింది. 

>
మరిన్ని వార్తలు