రూ.2 వేల నోటు, మరో షాకింగ్‌ న్యూస్‌

16 Jan, 2020 11:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ  : నోట్ట రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన పెద్ద నోటు రూ.2వేల నోటుపై తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్లను చెక్‌ పెట్టేందుకంటూ  రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్‌  ఆ తరువాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర‍్లతో రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తాజాగా తేలింది.  దేశంలో హల్‌ చల్‌ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని,  తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది.

ఎన్‌సీఆర్‌బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) అందించిన డేటా ప్రకారం పీఎం నరేంద్ర మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత  దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం  రూ.2వేల నోట్లు ఉన్నాయని ఈ డేటా వెల్లడించింది.  మొత్తంలో 56 శాతం రూ. 2వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి.. అంతేకాదు  రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీ పట్టుబడి, గుజరాత్‌  ఫేక్‌ కరెన్సీ అడ్డాగా మారిందని డేటా ద్వారా తెలుస్తోది. కాగా 2016, నవంబర్ 8న రూ .1000, రూ .500 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, అవినీతి, నకిలీ నోట్లు, నల్లధనాన్ని నిరోధించేందుకు తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.  భారతదేశంలో నకిలీ కరెన్సీపై తాము ఈ చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలు తమకు సహకరించాలనీ ​ కోరిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా