మూడు నెలల్లో  రూ. 10వేల కోట్లు 

28 Oct, 2019 11:29 IST|Sakshi

 మూడు నెలల్లో వ్యాపార నష్టం రూ. 10వేల కోట్లకు పైమాటే 

పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే మరింత నష్టం

50వేల ఉద్యోగాలు ప్రమాదంలో 

శ్రీనగర్ : కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి  వ్యాపారంలో భారీగా నష్టపోయింది. ఇది  మూడు నెలల్లో 10,000 కోట్లకు పైమాటేనని స్థానిక ట్రేడ్‌బాడీ తెలిపింది. ఆగస్టు-5, 2019 నుంచి మూడునెలల్లో రూ. పదివేల కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు నివేదించింది. గత మూడు నెలలనుంచి  కశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణస్థితికి రానందున నష్టాల స్వభావాన్ని అంచనా వేయడం కష్టమని కాశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు షేక్ ఆశిక్ అన్నారు.

కాశ్మీర్‌లో వ్యాపార నష్టాలు ఈ మూడు నెలల్లో రూ. 10,000 కోట్లు దాటేశాయని, దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఇటీవలి వారాల్లో కొంత వ్యాపార కార్యకలాపాలు జరిగినప్పటికీ, మందకొడిగానే జరిగిందని షేక్ ఆశిక్ తెలిపారు. ఇది దీర్ఘకాలంలో భారీ పరిణామాలనుచూపుతుందని ఆయన అన్నారు. వివిధ వ్యాపార రంగాలను ఉటంకిస్తూ ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయాన్న పూర్తిగా పునరుద్దరించలేదని, ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్‌ ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా హస్తకళా రంగానికి సంబంధించి జూలై-ఆగస్టులో ఆర్డర్‌లను స్వీకరిస్తారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నాటికి ఉత్పత్తులను వారికి పంపిణీ చేయాలి. యుఎస్, యూరప్‌లో సేవలందిస్తున్న సంస్థలు కశ్మీర్‌లో ఉన్నాయని, ఇంటర్నెట్ సదుపాయాలను నిలిపివేయడం వల్ల వ్యాపారం దెబ్బతింటుందని ఆశిక్ అన్నారు. కనెక్టివిటీ లేక ఆర్డర్లు లేని కారణంగా 50వేల మందికి పైగా చేతివృత్తులవారు,  చేనేత కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారనీ చెప్పారు.

కేవలం నష్టాలు మాత్రమే కాదు..వ్యాపారం చేసినా, చేయకపోయినా, జీఎస్‌టీ, ఆన్‌లైన్‌ రిటర్న్‌లాంటి టెక్నికల్‌ ఇబ్బందులు తమకు తప్పవని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లో వ్యాపారాలు నష్టపోతాయని, ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్న విషయాన్ని అధికార యంత్రాంగానికి తెలియజేశామన్నారు. అంతేకాదు నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, వ్యాపారుల బాధలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆశిక్  కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సంవత్‌ 2076 సందడి, నేడు సెలవు

ప్రధాని మోదీతో వరల్డ్‌ బ్యాంక్‌  ప్రెసిడెంట్‌ భేటీ

వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్‌ పిచాయ్‌

ఈసారి బంగారాన్ని పట్టించుకోలేదా?

ఫేస్‌బుక్‌ మరో ఆవిష్కారం 

28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం

దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన

స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల రికార్డు, టాప్‌ బ్రాండ్‌ ఇదే

కేంద్రం వద్దకు వొడాఫోన్‌–ఐడియా

జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

టాటా మోటార్స్‌ నష్టాలు రూ.188 కోట్లు

పసిడి ప్రియం.. సేల్స్‌ పేలవం!

ఎస్‌బీఐ లాభం... ఆరు రెట్లు జంప్‌

స్టాక్స్‌..రాకెట్స్‌!

ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్‌ ‘న్యూస్‌ ట్యాబ్‌’

స్టార్టప్‌లో బిన్నీ బన్సల్‌ భారీ పెట్టుబడులు

వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్‌ రేటింగ్స్‌

ఫ్లాట్‌ ముగింపు : బ్యాంక్స్‌ జూమ్‌

మోటో జీ8 ప్లస్‌ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్‌

జియో ఫోన్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ : కొత్త ప్లాన్స్‌ 

అదరగొట్టిన ఎస్‌బీఐ

లాభనష్టాల ఊగిసలాటలో సూచీలు

షేర్ల పతనం; ఇకపై ప్రపంచ కుబేరుడు కాదు!

రిలయన్స్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఆఫర్‌

ఇండిగో నష్టం 1,062 కోట్లు

ఐటీసీ లాభం 4,173 కోట్లు

మారుతీకి మందగమనం దెబ్బ

వ్యాపారానికి భారత్‌ భేష్‌..

టెల్కోలకు సుప్రీం షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

నటనలో ఆమెకు ఆమే సాటి 

బిగ్‌బాస్‌ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్‌

అది నిజమే.. అతను అసభ్యంగా ప్రవర్తించాడు

బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌