డెబిట్ కార్డ్స్ మార్కెట్లో రూపే వాటా 38 శాతం

15 Mar, 2016 00:46 IST|Sakshi
డెబిట్ కార్డ్స్ మార్కెట్లో రూపే వాటా 38 శాతం

ముంబై: రూపే కార్డ్స్ మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో జారీ అయిన రూపే డెబిట్ కార్డుల సంఖ్య జనవరి నాటికి 24.7 కోట్లుగా ఉంది. జారీ అయిన మొత్తం 64.5 కోట్ల డెబిట్ కార్డుల్లో దీని వాటా 38 శాతం. రూపే కార్డ్స్ మార్కెట్ వాటా పెరుగుదలకు కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం బాగా దోహదపడింది. రూపే కార్డుల జారీ ఎక్కువగా జన్ ధన్ ఖాతాలకే జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో జేఎం ఫైనాన్షియల్ ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. రూపే కార్డుల మార్కెట్ వాటా ఏటీఎం లావాదేవీల వారీగా చూస్తే 20.4 శాతంగా, పాయింట్ ఆఫ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ప్రకారం చూస్తే 4.1 శాతంగా ఉంది. ఇక ఆన్‌లైన్ లావాదేవీల్లో రూపే వాటా 1.6 శాతం. కాగా సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూపే క్రెడిట్ కార్డులను కూడా మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు