రూపాయికి ‘చమురు’ ఇంధనం!

21 Nov, 2018 00:23 IST|Sakshi

ఆరు ట్రేడింగ్‌ సెషన్స్‌ నుంచీ అప్‌ట్రెండ్‌

కీలక మద్దతు కిందకు నైమెక్స్‌  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరవరోజూ రికవరీ అయ్యింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం ముగింపుతో పోల్చితే 21 పైసలు బలపడింది. 71.46 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 71.67. మొత్తం ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో 143 పైసలు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు.

అంతర్జాతీయ వృద్ధి మందగమనానికి అవకాశం ఉందని అమెరికా ఫెడ్‌ తాజా వ్యాఖ్యలు, దీనితో రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారిన డాలర్‌ ఇండెక్స్‌ రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ వ్యూహకర్త ఆనంద్‌ జేమ్స్‌ అభిప్రాయపడ్డారు. ఎగుమతిదారులు, బ్యాంకర్ల డాలర్‌ అమ్మకాలు,  ట్రేడింగ్‌ ప్రారంభంతోనే రూపాయి పటిస్టంగా 71.39 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత 71.27కూ బలపడింది. అక్టోబర్‌ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్టం 74.39కి పడింది. అటు తర్వాత క్రమంగా ప్రస్తుత స్థాయికి రికవరీ అయ్యింది.  

క్రూడ్‌ భారీ పతనం...
తాజా గణాంకాలు చూస్తే, అంతర్జాతీయ మార్కెట్‌– నైమెక్స్‌లో లైట్‌ స్వీట్‌క్రూడ్‌ బ్యారల్‌ ధర ఈ వార్త రాసే సమయానికి కీలక మద్దతు 55.40 స్థాయిని కోల్పోయింది. (ఈ స్థాయిని అధిగమించడానికి దాదాపు ఏడాదిన్నర పట్టింది). ఐదు శాతానికి పైగా పతనంతో 53.66కు పతనం అయ్యింది.

ఈ ఏడాది డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ గరిష్టస్థాయి 76.90. ఇక భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ఈ ఏడాది గరిష్టస్థాయి 86.74.  అయితే నెమ్మదిగా కిందకు దిగుతూ, మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఐదుశాతానికి పైగా పతనమై 63.12ను తాకింది. ఇక ఈ వార్త రాసే రాత్రి 10 గంటలకు ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 96.51 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.45 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

10 వేల ఉద్యోగాలకు ఎసరు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

భారత పారిశ్రామికవేత్త అరెస్ట్‌

ఆర్‌బీఐ ‘ఉత్కర్ష్‌ 2022’

నిలిచిపోయిన ముకేశ్‌ డీల్‌..!

కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

‘59 మినిట్స్‌’తో రూ. 5 కోట్లు!

తగ్గిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు

ఫ్లాట్‌ ప్రారంభం : 38 వేల ఎగువకు సెన్సెక్స్‌

38వేల దిగువకు సెన్సెక్స్‌

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

బీఎస్ఎన్‌ఎల్‌ స్టార్‌ మెంబర్‌షిప్‌ @498

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

2018–2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

హ్యుందాయ్‌ కార్ల ధరలు మరింత ప్రియం

జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట!

ఫార్చూన్‌ ఇండియా 500లో ఆర్‌ఐఎల్‌ టాప్‌

‘ఇల్లు’ గెలిచింది..!

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం

అనిల్‌ అంబానీ కంపెనీల పతనం

మార్కెట్ల రీబౌండ్‌

మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి