రూపాయి75 పైసలు డౌన్‌!

3 Jan, 2019 01:43 IST|Sakshi

డాలర్‌ మారకంలో మళ్లీ 70.18కి

నాలుగు సెషన్స్‌లో మొదటి పతనం

 ముంబై: నాలుగు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ వరుసగా లాభాల బాటన పయనిస్తూ వచ్చిన రూపాయి మళ్లీ నష్టాల బాట పట్టింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో బుధవారం ఒకేరోజు డాలర్‌ మారకంలో 75పైసలు నష్టపోయి, 70.18 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆరు దేశాల కరెన్సీలపై డాలర్‌ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు, బలహీన వస్తు సేవల పన్ను వసూళ్లు  రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. మంగళవారం రూపాయి 34 పైసలు లాభంతో 69.43 వద్ద ముగిసింది. అయితే బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 69.60 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.23ను సైతం తాకింది. తగ్గిన క్రూడ్‌ ధరలే ప్రస్తుతం రూపాయి సెంటిమెంట్‌ కొంత బలంగా ఉండడానికి కారణం. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది.
 

మరిన్ని వార్తలు