రూపాయి మళ్లీ పతనం

22 Aug, 2019 11:11 IST|Sakshi

సాక్షి,ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి గురువారం బలహీనంగా కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆరువారాల కనిష్టం నుంచి బుదవారం కోలుకున్నప్పటికీ, ఈ రోజు నెగిటివ్‌ ట్రెండ్‌లోకి జారుకుంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే 71.65 వద్ద ప్రారంభమైనా అనంతరం 71.72 స్థాయికు పడిపోయింది. బుధవారం 71.55 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు బలహీన పడ్డాయి. బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.17 శాతం పడిపోయి బ్యారెల్‌కు 60.20 డాలర్లకు చేరుకుంది. అటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనా, ఇన్వెస్టర్ల అమ్మకాలతో దాదాపు 200 పాయింట్లకు పైగా  నష్టాలతో కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు