రెండేళ్ల కనిష్టానికి రూపాయి

15 Jan, 2016 02:11 IST|Sakshi
రెండేళ్ల కనిష్టానికి రూపాయి

44 పైసలు క్షీణత, 67.29 స్థాయికి
 ముంబై: దేశీ కరెన్సీ క్షీణత కొనసాగుతోంది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 44 పైసలు దిగజారి 67.29 వద్ద ముగిసింది. ఇది రెండేళ్లకుపైగా కనిష్టస్థాయి కావడం గమనార్హం. 2013, సెప్టెంబర్ 3 తర్వాత(67.63) మళ్లీ ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి 68.85 (2013, ఆగస్టు 28న).
 
 ప్రధానంగా బ్యాం కులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనం రూపాయి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 66.85తో పోలిస్తే భారీ నష్టంతో 66.98 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆతర్వాత పతనం మరింత తీవ్రత 67.30 స్థాయికి క్షీణించింది.
 

మరిన్ని వార్తలు