జారుడు బల్లపైకి మళ్లీ రూపాయి

24 Aug, 2018 01:19 IST|Sakshi

30పైసలు డౌన్‌; 70.11 వద్ద క్లోజ్‌ 

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ మళ్లీ జారిపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో గురువారం ఒకేరోజు 30 పైసలు పతనమయ్యింది. చివరకు 70.11 వద్ద ముగిసింది. అమెరికా వడ్డీరేట్ల పెంపు భయాలు, క్రూడ్‌ ధరలు పెరగవచ్చన్న ఆందోళనలు దీనికి కారణం. మంగళవారం రూపాయి విలువ 69.81 వద్ద ముగియగా, బక్రీద్‌ సందర్భంగా బుధవారం ఫారెక్స్‌ మార్కెట్‌ పనిచేయలేదు. గురువారం ట్రేడింగ్‌ ఒక దశలో రూపాయి 70.17ను సైతం తాకింది.

రూపాయి గడచిన శుక్రవారం (17వ తేదీ)  చరిత్రాత్మక కనిష్టం 70.15 వద్ద ముగిసిన సంForex marketగతి తెలిసిందే. శుక్రవారం ఒక దశలో 70.40 స్థాయినీ చూసింది. అటు తర్వాత జరిగిన రెండు ట్రేడింగ్‌ సెషన్‌లలో 34 పైసలు బలపడినా, ఆ స్థాయిలో నిలబడలేకపోవడం గమనార్హం. చైనా, భారత్‌సహా నాలుగు దేశాల మెటల్స్‌పై  అమెరికా విధించిన ఆంక్షల అమలు దీనికి నేపథ్యం. దీనితో వాణిజ్యయుద్ధం భయాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

మరిన్ని వార్తలు